jubilee hills constituency: జూబ్లీ హిల్స్.. 80 శాతం స్లమ్స్.. 20 శాతం డబ్బున్నోళ్లు
ABN, Publish Date - Nov 05 , 2025 | 04:15 PM
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. మూడు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు ప్రచారంలో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇది ఇలా ఉంటే చాలా మంది జూబ్లీహిల్స్ అంటే సంపన్నులు, బడాబాబులు ఉండే నియోజకవర్గం అని అనుకుంటారు. కానీ ..
హైదరాబాద్, నవంబర్ 5: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. మూడు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు ప్రచారంలో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇది ఇలా ఉంటే చాలా మంది జూబ్లీహిల్స్ అంటే సంపన్నులు, బడాబాబులు ఉండే నియోజకవర్గం అని అనుకుంటారు. కానీ జూబ్లీహిల్స్‌లో, బంజారాహిల్స్ లాంటి ఖరీదైన ప్రాంతాలు ఈ నియోజకవర్గ పరిధిలోకి రావన్న విషయం చాలా మందికి తెలియదు. జూబ్లీహిల్స్ డివిజన్, బంజారాహిల్స్ డివిజన్ ప్రాంతాలు ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలో ఉంటాయి. మైసూర్‌పాక్‌లో మైసూర్ లేనట్టే.. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జూబ్లీహిల్స్ ఉండదు. ఈ నియోజకవర్గంలో 20 శాతం కాలనీలు, అపార్ట్‌మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీలు ఉంటే 80 శాతం బస్తీలే ఉంటాయి. ఈ నియోజకర్గంలో పేద, మధ్యతరగతి వర్గాలే అధికం ఉన్నారు.
Updated Date - Nov 05 , 2025 | 04:16 PM