Jogi Ramesh: జోగి రమేష్ ఓవరాక్షన్.. 14 మంది వైసీపీ నేతలపై కేసు..
ABN, Publish Date - Sep 17 , 2025 | 09:38 PM
నిబంధనలకు వైసీపీ నేతలు మరోసారి పాతర వేశారు. 144 సెక్షన్ అధిగమించి మూలపాడు యాష్ డంపింగ్ యార్డ్‌కు వెళ్లడానికి ప్రయత్నించారు. దీంతో మాజీ మంత్రి జోగి రమేష్ సహా.. 14 మంది వైసీపీ నేతలపై ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు.
నిబంధనలకు వైసీపీ నేతలు మరోసారి పాతర వేశారు. 144 సెక్షన్ అధిగమించి మూలపాడు యాష్ డంపింగ్ యార్డ్‌కు వెళ్లడానికి ప్రయత్నించారు. దీంతో మాజీ మంత్రి జోగి రమేష్ సహా.. 14 మంది వైసీపీ నేతలపై ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. నాయకులు, కార్యకర్తలతో కలిసి మూలపాడులో ఉన్న బూడిద డంపింగ్ యార్డ్ పరిశీలనకు జోగి రమేష్, వైసీపీ నేతలు వెళ్తున్న సమయంలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వైసీపీ శ్రేణులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో జోగి రమేష్, నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..
Updated Date - Sep 17 , 2025 | 09:38 PM