5MM National Flag: 5 మిల్లీమీటర్ల వెడల్పుతో జాతీయ జెండా..
ABN, Publish Date - Aug 14 , 2025 | 09:52 PM
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం గిరిజన గురుకుల బాలుర కళాశాల సూక్ష్మ కళాకారుడు తన అద్భుత ప్రతిభతో ఆకట్టుకున్నాడు. రజనీకాంత్ అనే ఈ సూక్ష్మ కళాకారుడు పెన్సిల్ గ్రాఫైట్‌పై జాతీయ జెండాను రూపొందించాడు..
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం గిరిజన గురుకుల బాలుర కళాశాల సూక్ష్మ కళాకారుడు తన అద్భుత ప్రతిభతో ఆకట్టుకున్నాడు. రజనీకాంత్ అనే ఈ సూక్ష్మ కళాకారుడు పెన్సిల్ గ్రాఫైట్‌పై జాతీయ జెండాను రూపొందించాడు. 4 మిల్లీమీటర్ల ఎత్తు, 2 మిల్లీమీటర్ల వెడల్పుతో జెండాను తయారు చేశాడు. గంట పాటు శ్రమించి, జాతీయ పతాకానికి రూపకల్పన చేశాడు. అలాగే చాక్‌పీస్‌పై కూడా 7 మిల్లీమీటర్ల ఎత్తు, 2 మిల్లీమీటర్ల వెడల్పుతో జాతీయ జెండాను తయారు చేశాడు. అదేవిధంగా చాక్‌పీస్‌లపై హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని రాసి తన ప్రతిభను చాటుకున్నాడు. గతంలో కూడా చాక్‌పీస్‌లపై జతీయ గీతం, వందేమాతరం గీతం రాసినట్లు రజనీకాంత్ చెబుతున్నాడు.
Updated Date - Aug 14 , 2025 | 09:52 PM