Heavy Rains : బంగాళాఖాతంలో అల్పపీడనం.. 24 గంటలు అతి భారీ వర్షాలు
ABN, Publish Date - Oct 23 , 2025 | 10:37 AM
బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాగల 24 గంటల్లో ఏపీలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాగాల 24 గంటల్లో ఏపీలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఏపీకి రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో 14 జిల్లాలకు మెరుపు వరదలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అటు గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Updated Date - Oct 23 , 2025 | 10:37 AM