Dharmasthala Case: ధర్మస్థల కుట్ర వెనుక ఎవరున్నా శిక్షించాలి.. బీజేపీ డిమాండ్
ABN, Publish Date - Aug 23 , 2025 | 01:20 PM
సంచలనంగా మారిన ధర్మస్థల ఘటనపై బీజేపీ ఆందోళనలకు సిద్ధమైంది. ఆగస్టు చివరి వారంలో కర్నాటక వ్యాప్తంగా నిరసనలకు దిగనుంది.
సంచలనంగా మారిన ధర్మస్థల ఘటనపై బీజేపీ ఆందోళనలకు సిద్ధమైంది. ఆగస్టు చివరి వారంలో కర్నాటక వ్యాప్తంగా నిరసనలకు దిగనుంది. అత్యాచారానికి గురై.. అత్యంత దారుణంగా హత్యకు గురైన వందలాది మంది మహిళలను ధర్మస్థలలో ఖననం చేశారని, ఆలయ నిర్వహణలోని పెద్దలే తనతో చేయించారని ఫిర్యాదు చేసిన వ్యక్తి ప్రస్తుతం తనకేమీ తెలీదని, కొంతమంది కలిసి ఇలా చెప్పించారని సిట్ అధికారులకు తెలిపాడు. సిట్ విచారణలో ఫిర్యాదుదారుడు చూపించిన 15 ప్రాంతాల్లో తవ్వకాలు జరపగా.. రెండు ప్రాంతాల్లో మాత్రమే మానవ అవశేషాలను సిట్ గుర్తించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఆ రెండు ప్రాంతాల్లో దొరికినవి పురుషుని అవశేషాలుగా ఫోరెన్సిక్ ల్యాబ్‌లో గుర్తించారు.
పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..
Updated Date - Aug 23 , 2025 | 01:20 PM