ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Patancheru: జగ్గారెడ్డితో ఆదిశ్రీనివాస్‌, వినోద్‌రెడ్డి భేటీ

ABN, Publish Date - May 06 , 2025 | 04:53 AM

టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డితో ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, టీపీసీసీ ఉపాధ్యక్షుడు వినోద్‌రెడ్డిలు సోమవారం భేటీ అయ్యారు.

  • పటాన్‌చెరు కాంగ్రెస్‌ రాజకీయాలపై చర్చ

  • ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, సీనియర్‌ నేత కాట శ్రీనివా్‌సగౌడ్‌లను సమన్వయం చేయండి

  • ఈ మేరకు అభిప్రాయం చెప్పిన జగ్గారెడ్డి

హైదరాబాద్‌, మే 5 (ఆంధ్రజ్యోతి): టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డితో ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, టీపీసీసీ ఉపాధ్యక్షుడు వినోద్‌రెడ్డిలు సోమవారం భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని జగ్గారెడ్డి కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో పటాన్‌చెరు నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్‌ పార్టీలో నెలకొన్న రాజకీయ అంశాలపైన వారు చర్చించుకున్నారు. పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, పార్టీ సీనియర్‌ నేత కాట శ్రీనివా్‌సగౌడ్‌.. ఆయన అనుచరులకు మధ్య వివాదం నెలకొని ఉన్న సంగతి తెలిసిందే.


దీనికి సంబంధించి విచారణ కోసం ఆది శ్రీనివాస్‌, వినోద్‌ రెడ్డిలతో టీపీసీసీ చీఫ్‌ మహే్‌షగౌడ్‌ కమిటీ వేశారు. ఈ వివాదం పరిష్కారానికి ఉమ్మడి మెదక్‌ జిల్లా ముఖ్య నాయకులను ఆది శ్రీనివాస్‌, వినోద్‌రెడ్డిలు కలుస్తున్నారు. ఇందులో భాగంగా తూర్పు జగ్గారెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా మహిపాల్‌రెడ్డిని, కాటం శ్రీనివా్‌సగౌడ్‌.. ఆయన అనుచరులనూ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని కమిటీ సభ్యులకు జగ్గారెడ్డి తన అభిప్రాయంగా చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Pahalgam Terror Attack: ప్రధాని మోదీతో రక్షణ శాఖ కార్యదర్శి భేటీ.. ఎందుకంటే..

WAQF Amendment Bill 2025: వక్ఫ్ సవరణ బిల్లుపై విచారణను ఈ నెల 15కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు

TGSRTC: బస్ భవన్‌‌ను ముట్టడించిన కార్మికులు.. పరిస్థితి ఉద్రిక్తం

For Telangna News And Telugu News

Updated Date - May 06 , 2025 | 04:53 AM