ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Bandi Sanjay: న్యూఢిల్లీలోని కేంద్ర మంత్రి కార్యాలయానికి బెదిరింపులు.. రంగంలోకి దిగిన పోలీసులు

ABN, Publish Date - May 08 , 2025 | 09:13 PM

Bandi Sanjay: న్యూఢిల్లీలోని కేంద్ర మంత్రి బండి సంజయ్ కార్యాలయానికి ఓ వ్యక్తి పోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆయన కార్యాలయ అధికారులు వెంటనే స్పందించి.. రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబును సంప్రదించారు. దీంతో సీపీ ఆదేశాల మేరకు పోలీసులు రంగంలోకి దిగారు.

Central Minister Bandi Sanjay

న్యూఢిల్లీ, మే 08: తాను చెప్పిన పని చేయాలని.. లేకుంటే మీ సంగతి చూస్తాంటూ ఓ అజ్ఝాత వ్యక్తి న్యూఢిల్లీలోని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కార్యాలయానికి గురువారం ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో కేంద్ర మంత్రి బండి సంజయ్ కార్యాలయం వెంటనే స్పందించింది. ఈ బెదిరింపులపై ఆయన కార్యాలయం.. హైదరాబాద్‌లోని రాచకొండ కమిషనర్ సుధీర్ బాబుకు ఫోన్ చేసి వివరించింది. దాంతో సీపీ సుధీర్ బాబు ఆదేశాల మేరకు.. పోలీసులు రంగంలోకి దిగారు. ఆ క్రమంలో ఈ బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి ఎక్కడి నుంచి ఫోన్ చేశాడంటూ.. సెల్ టవర్ల ఆధారంగా విచారణ చేపట్టారు.


దీంతో ఆదిభట్ల పరిధిలోని నాదర్ గుల్ సమీపంలో జయసూర్యనగర్‌కు చెందిన కేపీ రావు.. ఈ ఫోన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో కేపీరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు పోలీసులు తరలించారు. ఆ తర్వాత అతడిని పోలీసులు విచారిస్తున్నారు. అయితే గతంలో సైతం కేపీ రావు.. లంచాల కోసం పలు ప్రభుత్వ కార్యాలయాలతోపాటు పలువురు రాజకీయ నాయకులకు ఈ తరహా ఫోన్లు చేసి బెదిరింపులకు పాల్పడే వారని పోలీసుల విచారణలో గుర్తించారు.

ఈ వార్తలు కూడా చదవండి..

TDP Mahanadu: మహానాడుకు వచ్చే అతిథుల కోసం వసతి ఏర్పాట్లు పూర్తి

Operation Sindoor: దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీయాలని చూస్తే సహించేది లేదు: సీఎం రేవంత్ రెడ్డి

Modakondamma Jathara: మోదకొండమ్మ జాతరకు సర్వం సిద్ధం

CM Chandrababu Security: సీఎం చంద్రబాబు భద్రతపై డీజీపీ కీలక ఆదేశాలు

HYDRAA: హైడ్రా అంటే కొందరికి కడుపు మంట: సీఎం రేవంత్‌ రెడ్డి

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌లో స్కై స్ట్రైకర్స్ కీలకం

Operation Sindoor: ఈ పాపకు ఆ తల్లిదండ్రులు ఏం పేరు పెట్టారో తెలుసా..

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై స్పందించిన పహల్గాం మృతుడి భార్య

Updated Date - May 08 , 2025 | 09:13 PM