Share News

TDP Mahanadu: మహానాడుకు వచ్చే అతిథుల కోసం వసతి ఏర్పాట్లు పూర్తి

ABN , Publish Date - May 08 , 2025 | 08:35 PM

TDP Mahanadu: కడప జిల్లాలో తొలిసారి పసుపు పండుగ మహానాడు జరుగుతుందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి గుర్తు చేశారు. ఈ కార్యక్రమ నిర్వహణ కోసం కమిటీలు వేసి వాటి ద్వారా మహానాడును విజయవంతం చేస్తామన్నారు.

TDP Mahanadu: మహానాడుకు వచ్చే అతిథుల కోసం వసతి ఏర్పాట్లు పూర్తి
Kadapa Dist TDP Chief R Srinivas Reddy

కడప, మే 08: తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న మహానాడు కార్యక్రమాన్ని నభూతో నభవిష్యత్తు అనే విధంగా నిర్వహిస్తామని కడప జిల్లా టీడీపీ అధ్యక్షులు, ఆ పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమానికి వచ్చే అతిధుల కోసం వసతి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. గురువారం కడపలో శ్రీనివాసులు రెడ్డి విలేకరలతో మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి తొలి రోజు 40 వేల మంది అతిథులు హాజరవుతున్నారన్నారు. 12 జిల్లాల నుంచి వచ్చే వారి కోసం వసతి ఏర్పాట్లు చేశామని చెప్పారు.

ఈ జిల్లాలో తొలిసారి పసుపు పండుగ మహానాడు జరుగుతుందని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమ నిర్వహణ కోసం కమిటీలు వేసి వాటి ద్వారా మహానాడును విజయవంతం చేస్తామన్నారు. ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఎక్కడా ఎటువంటి సమస్య లేకుండా ఏర్పాట్లు చేశామని తెలిపారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు చెందిన శాసనసభ్యులను కలుపుకుని ఈ మహానాడును విజయవంతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.


సోమవారం నుంచి పూర్తి స్థాయి పనులు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. జిల్లాలోని లాడ్జిలు, కళ్యాణ మండపాలుతోపాటు స్కూళ్లు అన్నింటిలో వసతి ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 9063596644 ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. మహానాడు ముగింపు రోజు.. అంటే మూడవ రోజు ఐదు లక్షల మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నామన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

Operation Sindoor: దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీయాలని చూస్తే సహించేది లేదు: సీఎం రేవంత్ రెడ్డి

Modakondamma Jathara: మోదకొండమ్మ జాతరకు సర్వం సిద్ధం

CM Chandrababu Security: సీఎం చంద్రబాబు భద్రతపై డీజీపీ కీలక ఆదేశాలు

HYDRAA: హైడ్రా అంటే కొందరికి కడుపు మంట: సీఎం రేవంత్‌ రెడ్డి

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌లో స్కై స్ట్రైకర్స్ కీలకం

Operation Sindoor: ఈ పాపకు ఆ తల్లిదండ్రులు ఏం పేరు పెట్టారో తెలుసా..

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై స్పందించిన పహల్గాం మృతుడి భార్య

For Andhrapradesh News And Telugu News

Updated Date - May 08 , 2025 | 08:43 PM