ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Seethakka: ప్రతిపక్ష నేత పేరిట మండలం

ABN, Publish Date - Jun 01 , 2025 | 03:25 AM

రాష్ట్రంలోని ఓ మండలానికి ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీకి చెందిన నేత పేరు పెట్టింది. ములుగు జిల్లాలో కొత్తగా ఏర్పడిన మల్లంపల్లి మండలం పేరును జేడీ మల్లంపల్లిగా రాష్ట్ర ప్రభుత్వం మార్పు చేసింది.

  • ములుగు జిల్లా మల్లంపల్లి పేరు జేడీ మల్లంపల్లిగా మార్పు

  • హామీ నెరవేర్చిన మంత్రి సీతక్క

హైదరాబాద్‌, ములుగు, మే 31(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఓ మండలానికి ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీకి చెందిన నేత పేరు పెట్టింది. ములుగు జిల్లాలో కొత్తగా ఏర్పడిన మల్లంపల్లి మండలం పేరును జేడీ మల్లంపల్లిగా రాష్ట్ర ప్రభుత్వం మార్పు చేసింది. ఇందుకు సంబంధించిన గెజిట్‌ శనివారం విడుదలైంది. బీఆర్‌ఎస్‌ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడు, మాజీ జడ్పీ చైర్మన్‌, దివంగత కుసుమ జగదీష్‌ పేరును చేర్చుతూ మల్లంపల్లిని జేడీ మల్లంపల్లిగా మార్పు చేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు మల్లంపల్లిని మండలంగా ప్రకటించాలంటూ కుసుమ జగదీష్‌ తీవ్రంగా ప్రయత్నించారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత మల్లంపల్లిని మండలంగా ప్రకటిస్తూ నోటిఫికేషన్‌ జారీ చేసింది. అయితే, కుసుమ జగదీష్‌ ఇటీవల మరణించగా.. పరామర్శకు వెళ్లిన మంత్రి సీతక్క.. మల్లంపల్లి మండలానికి ఆయన పేరు పెట్టిస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు పేరు మార్పుపై గెజిట్‌ విడుదల కావడంతో సీతక్క ఇచ్చిన హామీ నెరవేరింది. కాగా, రాజకీయాలకు అతీతంగా ప్రతిపక్ష పార్టీకి చెందిన నేత పేరిట మండలాన్ని ఏర్పాటు చేయించినందుకు మంత్రి సీతక్కకు మల్లంపల్లి మండల సాధన సమితి సభ్యులు, ప్రజలు ధన్యవాదాలు తెలియజేశారు.


అంగన్‌వాడీల పదవీ విరమణ వయస్సు పెంపు

హైదరాబాద్‌, మే 31 (ఆంధ్రజ్యోతి):అంగన్‌వాడీ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 65 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వ కార్యదర్శి అనితా రామచంద్రన్‌ శనివారం ఉత్తర్వులిచ్చారు. దీంతోపాటు అంగన్‌వాడీ ఉద్యోగుల పదవీ విరమణ ప్రయోజనాలను రూ.లక్ష నుంచి రూ.2 లక్షలకు, సహాయకులకు రూ.50వేల నుంచి రూ.లక్ష పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 60ఏళ్లు దాటి స్వచ్ఛంద పదవీ విరమణ చేసే ఉద్యోగులకు కూడా ఈ ప్రయోజనాలు వర్తిస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

jagtyaala : పాఠ్య పుస్తకాలు వస్తున్నాయి..

Crime News: తెలంగాణ భవన్ నుంచి సైబర్ నేరస్తుడు పరారీ..

TG News: ఢీకొన్న రెండు కార్లు.. ఆ తర్వాత ఏమైందంటే..

Indigo Flight Delay: ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 01 , 2025 | 03:25 AM