Home » Mulugu
మావోయిస్టు నేత కొయ్యాడ సాంబయ్య అలియాస్ గోపన్న లొంగిపోతున్నట్లు గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రచారంపై ఆయన కుటుంబసభ్యులు స్పందించారు.
మేడారం వనదేవతల గద్దెల పునర్నిర్మాణ పనులను మంత్రులు పరిశీలించారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ మేడారం చేరుకుని వనదేవతలను దర్శించుకున్నారు.
ఉదయ్ కిరణ్ అనే అబ్బాయి లవ్ చేస్తున్నానని నమ్మబలికి యువతిని శారీరకంగా లొంగ దీసుకున్నాడు. పలు మార్లు ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న పవన్ కళ్యాణ్ అనే మరో వ్యక్తి యువతిపై అత్యాచారం చేసేందుకు కుట్ర పన్నాడు. ఎలాగైనా ఆ యువతిపై తన కామవాంఛ తీర్చుకోవాలనుకున్నాడు. ఉదయ్ కిరణ్ తో ఉన్న సంబంధాన్ని బయటపెడతానని బాధితురాలిని పవన్ కళ్యాణ్ బెదిరించాడు. వీరిద్దరి విషయం బయటికి చెబుతానని బెదిరించి యువతిపై అత్యాచారం చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
సుప్రీంకోర్టులో ములుగు జిల్లా మంగపేట మండలంలోని పలు గ్రామాల ట్రైబల్ కేసుపై మంగళవారం విచారణ జరిగింది. ఈ కేసుపై జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్తో కూడిన ధర్మాసనం విచారణ చేసింది.
మేడారం ఆలయ విస్తరణపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు. ఆలయ ఆవరణలోని చెట్లను సంరక్షించుకుంటూనే విస్తరణ ప్రక్రియను కొనసాగించాలని సీఎం తెలిపారు.
సాదా బైనామాలకు అడ్డంకులు తొలిగాయి. ఐదున్నరేళ్లుగా ఎదురుచూస్తున్న రైతుల నిరీక్షణకు తెరపడింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2020లో తీసుకువచ్చిన 112జీవో స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం భూ భారతి చట్టం తీసుకరావటంతో పాటు ప్రభుత్వం సాదా బైనామాల పరిష్కారంపై విధివిదానాలను హైకోర్టుకు సమర్పించింది. దీంతో హైకోర్టు తన ముందు ఉన్న పిల్ను కొట్టివేసింది. ప్రభుత్వం సాదా బైనామాల దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
గోదావరి నదిపై ములుగు జిల్లాలో నిర్మిస్తున్న సమ్మక్కసాగర్ (తుపాకులగూడెం) బ్యారేజీ అనుమతులకు మార్గం సుగమమైంది.
ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లిలోని బొగత జలపాతానికి పర్యాటకుల తాకిడి పెరిగింది.
ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాకపోవడంతో ఆవేదనకు గురైన ఓ యువకుడు తమ గ్రామ వాట్సాప్ గ్రూపులో పెట్టిన పోస్టు.. అతని బలవన్మరణానికి కారణమైంది. బాధితుడి బంధుమిత్రుల కథనం ప్రకారం.
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం మహాజాతర ముహూర్తం ఖరారైంది. 2026 జనవరి 28 నుంచి 31 వరకు జాతర జరుగుతుందని దేవస్థాన కార్యనిర్వాహక