మేడారం సమ్మక్కకు పుట్టింటి చీర
ABN , Publish Date - Jan 23 , 2026 | 11:04 AM
మేడారం సమ్మక్క తల్లికి పుట్టింటి చీరను సమర్పిచారు. మహాజాతరకు ముందు సమ్మక్క తల్లికి పుట్టింటి వారైన చందా వంశీయులు మహా జాతరకు ముందు ఆడపడుచు లాంఛనాల్లో భాగంగా గురువారం చీర సారెతోపాటు పూలు, పండ్లు, పసుపు, కుంకుమ, ఒడిబియ్యం సమర్పించారు.
- మేడారంలో గద్దెకు సమర్పించిన చందా వంశీయులు
తాడ్వాయి(ములుగు): కోరికలు తీర్చే కొంగు బంగారంగా పిలిచే సమ్మక్క(Sammakka) తల్లికి పుట్టింటి వారైన చందా వంశీయులు మహా జాతరకు ముందు ఆడపడుచు లాంఛనాల్లో భాగంగా గురువారం చీర సారెతోపాటు పూలు, పండ్లు, పసుపు, కుంకుమ, ఒడిబియ్యం సమర్పించా రు. సమ్మక్కను చందా వంశం ఆడబిడ్డగా కొలుస్తారు. తాడ్వాయి మండలం బయ్యక్కపేట గ్రామానికి చెందిన చందా బాబురావు తలపతి కుటుం బ సమేతంగా మేడారం వచ్చి వనదేవతలను దర్శించుకొని సమ్మక్క గద్దెకు ఆడబిడ్డ లాంఛనాలు సమర్పించారు.

ఈ కార్యక్రమంలో చందా వంశీయులు పరమయ్య, గోపాల్‌రావు, రఘుపతిరావు, కల్యాణ్‌కుమార్, కృష్ణమూర్తి, రవి, కిషన్‌రావు, వెంకటేశ్వర్లు, గణేష్, సురేష్, రాంప్రసాద్, గౌరీశంకర్, శ్రావణ్‌కుమార్, లక్ష్మి, నిర్మల, సునీత, పద్మ, సుక్కబాయి, కులపెద్ద బత్కయ్య తదితరులు పాల్గొన్నారు.
గుడికి చేరిన పూజారులు..

తాడ్వాయి: మహాజాతర సందర్భంగా పూజరులు నిర్వహించి మండె మెలిగే పండుగ సందర్భంగా బుధవారం రాత్రి మేడారం గద్దెల వద్ద జాగారం చేసిన పూజారులు గురువారం ఉదయం గ్రామాల్లోని గుడులకు తిరుగు ప్రయాణం అయ్యారు. సూర్యోదయం కాకముందు జాగారాన్ని ముగించుకొని వనదేవతల గద్దెలను దర్శించుకున్నారు. అనంతరం డోలు వాయిద్యాల నడుమ గుడులకు తిరుగు ప్రయా ణం చేశారు.
ఈ క్రమంలో భక్తులు దేవత పూనిన పూజారుల ముందు నేలపై పడుకుంటారు. వారి పైనుంచి పూజారులు వెళ్తే చిడపీడలు తొలగిపోతాయని నమ్ముతారు. సంతానం లేని వారు సంతానం కలుగుతుందని విశ్వసిస్తారు. ఇంటి ముందు నుంచి వెళ్తున్న క్రమంలో నీరు ఆరబోసి మొక్కుకున్నారు. ఈ తంతుతో మండె మెలిగే పండుగ ముగిసింది. వచ్చే బుధవారం (ఈనెల 28న) నుంచి మహా జాతర ప్రారంభం కానుంది.
ఈ వార్తలు కూడా చదవండి.
హమ్మయ్య! పసిడి, వెండి ధరలు తగ్గాయోచ్!
Read Latest Telangana News and National News