మేడారం జాతర ఎంతగానో మారింది...
ABN , Publish Date - Jan 31 , 2026 | 11:01 AM
మేడారం జాతర.. ఎంతగానో మారింది.. గతంతోపోలిస్తే చాలా మార్పులు చోటుచేసుకున్నాయని డీజీపీ శివధర్‌రెడ్డి అన్నారు. 1996లో తాను ట్రైనీ ఐపీఎస్‌గా ఉన్నప్పుడు మేడారం వచ్చానని, అప్పటికీ ఇప్పటికీ జాతరలో చాలా మార్పులు వచ్చాయన్నారు.
- రోడ్ల వెడల్పుతో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగాయి
- ఈ సారి జాతరలో చైల్డ్ ట్రాక్ మేనేజ్‌మెంట్ సిస్టంతో సత్ఫలితాలు
- డీజీపీ శివధర్‌రెడ్డి.. తల్లులకు మొక్కులు
మేడారం(ములుగు): అదివాసీల సహకారం తో పొలీసులు జాతరలో ఉత్సాహంగా విధులు నిర్వహించారని రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి(DGP Shivadhar Reddy) తెలిపారు. వనదేవతలను దర్శించుకున్న డీజీపీ.. కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానించిన సీసీ పుటేజీల్లో జాతరలో భక్తుల రద్దీ, జాతరకు వచ్చే దారుల్లో ఉన్న ట్రాఫిక్‌ను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే జాతరలో పిల్లలు, వృద్ధులు తప్పిపోతే అచూకీ తెలుసుకోవడానికి గత జాతరల్లో జాప్యం జరిగేదని,
కానీ ఈ జాతరలో కొత్తగా చైల్ట్ ట్రాక్ మేనేజ్‌మెంట్ సిస్టం అనే కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టి పిల్లలు, వృద్ధుల చేతులకు హ్యాండ్ బ్యాండ్ పెట్టడం ద్వారా క్యూఆర్ కోడ్ ద్వారా తప్పిపోయిన పిల్లలు, వృద్ధులను కనుక్కోవడం సులువ గా మారిందన్నారు తద్వారా బాధితులతో పాటు పోలీస్‌శాఖకు సంతృప్తిని కల్గించం దన్నారు. పొలీస్‌శాఖలో విధులు నిర్వహించేందుకు సిద్ధమవుతున్న ట్రైయినీ ఐపీఎస్, డీఎస్పీలు పని నేర్చుకునేందుకు జాతరలో విధులు కేటాయించామన్నారు.
1996లో తాను ట్రైనీ ఐపీఎస్‌గా ఉన్నప్పుడు మేడారం వచ్చానని, అప్పటికీ ఇప్పటికీ జాతరలో చాలా మార్పులు వచ్చా యన్నారు. జాతరకు వచ్చే అన్ని మార్గాల్లో రోడ్లను వెడల్పు చేసి, ట్రాఫిక్ జామ్ అయితే పక్క నుంచి పోయేందుకు ప్రత్యా మ్నాయ మార్గాలు ఏర్పాటు చేయడంతో ట్రాఫిక్ జామ్‌కు అస్కారం లేకుండా పొయిందన్నారు. డ్రోన్ లను ఏర్పాటు చేయడం ద్వారా జాతరలో ప్రతీ మూలకు జరుగుతున్న కార్యకలాపాల ను పరిశీలిం చేందుకు అనువుగా మారిందన్నారు. డీజీపీ వెంట మల్టీజోన్-1 ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి, వరంగల్, రామగుండం పోలీస్ కమిషనర్లు సన్‌ప్రీత్ సింగ్, అంబర్ కిషోర్ ఝా తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
పసిడి ధరలు రికార్డు స్థాయిలో డౌన్! నేటి రేట్స్ ఇవీ
Read Latest Telangana News and National News