Share News

కాలినడకన మేడారానికి...

ABN , Publish Date - Jan 24 , 2026 | 01:29 PM

మేడారం మహాజాతరకు భక్తులు కొంతమంది కాలినడకన చేరుకుంటున్నారు. కోరిన కోర్కెలు తీర్చే తల్లులుగా పేరుందిన సమ్మక్క-సారలమ్మ మహాజాతర ఈనెల 28, 29, 30, 31 తేదీల్లో జరుగనుంది. అయితే.. కొంతమంది తమ మొక్కుల ప్రకారం మేడారానికి కాలినడకన బయలుదేరుతున్నారు.

కాలినడకన మేడారానికి...

- భక్తిపారవశ్యంతో తల్లుల దర్శనానికి వస్తున్న భక్తులు

ములుగు: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం(Medaram)లోని సమ్మక్క, సారలమ్మలకు కోరిన కోర్కెలు తీర్చే తల్లులుగా పేరుంది. ప్రతీ రెండేళ్లకోసారి జరిగే ఈ మహా జాతరకు వచ్చిన భక్తులు వనదేవతలకు మొక్కులు తీర్చుకుంటారు. కోరిన కోర్కెలను తల్లులు తీర్చడంతో ఎత్తు బంగారం(బెల్లం), చీర, సారె, పసుపు, కుంకుమలు ఇచ్చి, కోడి, యాటలతో మొక్కులు చెల్లించుకుంటుంటారు.


కొందరు భక్తులు సుదూర ప్రాంతం నుంచి కాలినడకన మేడారానికి వచ్చి భక్తిని చాటుకుంటూ తల్లులను దర్శనం చేసుకుం టున్నారు. ఇందులో భాగంగా ఖమ్మం, విజయవాడ, కొత్తగూడెం(Khammam, Vijayawada, Kothagudem) నుంచి భక్తులు కొందరు రాత్రింభవళ్లు నడిచి శుక్రవారం మేడారానికి చేరుకున్నారు.


zzzzzzzzz.jpg

ఖమ్మం టూ మేడారం...

కోరిన కోర్కెలు తీర్చిన తల్లులచెంతకు ఇద్దరు యువకులు సుమారు165 కి.మీ దూరం నుంచి కాలినడకన బయలు దేరారు. ఈ నెల 19న ఖమ్మం నుంచి పి.కో టయ్య, కె.అనిల్‌కుమార్‌ బయలు దేరి శుక్రవారం వనదేవతల గద్దెల వద్దకు చేరుకున్నారు. గత జాతర సమయంలో సొంత ఇల్లు కొనుక్కోవాలని అమ్మలను కోరుకున్నట్లు, ఆ కోరిక తీరితే నీ చెంతకు కాలినడకన వస్తాను అని మొక్కుకున్నారు. ఆ కోరిక తీరడంతోశుక్రవారం మొక్కు తీర్చుకున్నామని వారు తెలిపారు.


తాతముత్తాల నుంచి కొలుస్తున్నాం..

- జె.బాదల్‌ గుజరాత్‌, కొత్తగూడెం

మా పూర్వీకులు కొత్తగూడెంకు వలస వచ్చారు. మేడారం సమ్మక్క, సారలమ్మలను మా తాతముత్తాతల నుంచి కొలుస్తూ వస్తున్నాం. పిల్లా పాపలతో సల్లంగా చూడు తల్లి అని కోరుకోవడంతో అమ్మల దీవనతో కుటుంబమంతా ఆయురారోగ్యాలతో జీవిస్తున్నాం. అందుకే నా కుమారుడు శంకర్‌, ఇద్దరు అల్లుల్లు హరీష్‌, పోడియాతో కలిసి కొత్తగూడెం నుంచి వరంగల్‌కు రైలులో వచ్చి అక్కడి నుంచి బుధవారం కాలినడకన మేడారం బయలుదేరాం. శుక్రవారం తల్లుల చెంతకు చేరుకుని మొక్కులు చెల్లించుకున్నాం.


మేడారానికి ఐదోసారి పాదయాత్ర చేస్తున్నాం..

- పంకజ్‌, మహేష్‌,విజయవాడ

వేడారం సమ్మక్క, సారలమ్మల చెంతకు పాదయాత్రగా రావడం ఇది 5వ సారి. విజయవాడ నుంచి రైలులో వరంగల్‌కు బుధవారం చేరుకున్నాం. కోరిన ప్రతీ కోర్కెను తల్లులు తీర్చడంతో అమ్మలపై మరింత నమ్మకం పెరిగింది. మా ఇంటి ఇలవేల్పులైన సమ్మక్క, సారలమ్మలకు ఇచ్చిన మాట ప్రకారం కాలినడకన వచ్చి మొక్కు తీర్చుకుంటున్నాం.


ఈ వార్తలు కూడా చదవండి

మెరుపు వేగంతో పెరుగుతున్న పసిడి, వెండి ధరలు! నేటి రేట్స్ చూస్తే..

జగన్‌ శవయాత్ర చేసినా పట్టించుకోరు: మంత్రి సవిత

Read Latest Telangana News and National News

Updated Date - Jan 24 , 2026 | 01:38 PM