Share News

మేడారం కిటకిట.. ఒక్కరోజే 3 లక్షల మందికు పైగా..

ABN , Publish Date - Jan 24 , 2026 | 12:11 PM

భక్తులతో మేడారం కిటకిటలాడుతోంది. జాతరకు సమయం దగ్గరపడడంతో.. భక్తులు ముందస్తుగానే చేరుకుని తమతమ మొక్కులను చెల్లించుకుంటున్నారు. దీంతో మేడారం కిటకిటలాడుతోంది. నిన్న ఒక్కరోజే 3 లక్షల మందికి పైగా భక్తులు విచ్చేసినట్లు అధికార వర్గాలు తెలుపుతున్నాయి.

మేడారం కిటకిట.. ఒక్కరోజే  3 లక్షల మందికు పైగా..

- జోరుగా ముందస్తు మొక్కులు

- 3 లక్షల మందికు పైగా తరలివచ్చిన భక్తులు

తాడ్వాయి(ములుగు): మేడారం(Medaram) మహా జాతరకు మరో ఐదు రోజుల వ్యవధే ఉంది. ముందస్తు మొక్కులు చెల్లించుకోవడానికి భక్తులు పెద్దఎత్తున మేడారం తరలివస్తు న్నారు. మహా జాతరను తలపించేలా ప్రధాన కూడళ్లు, గద్దెలు, జంపన్నవాగు స్నాన ఘట్టాలు, తలనీలాలు సమర్పించే కల్యాణకట్టలు, ఆర్టీసీ బస్టాండ్‌, పార్కింగ్‌ స్థలాలు, విడిది చేస్తే అటవీ ప్రాంతాల్లో భక్తజనంతో శుక్రవారం రద్దీగా మారాయి. 3 లక్షల మందికి పైగా భక్తులు ప్రైవేటు, ఆర్టీసీ వాహనాల్లో తరలివచ్చారు. దీంతో రోడ్లపై వాహనాలు బారులు తీరాయి. సమ్మక్క, సారలమ్మలకు ముందస్తు మొక్కులు చెల్లించుకోవడానికి వచ్చిన భక్తులతో మేడారం పరిసరాలన్నీ జనసంద్రంగా మారాయి.


zzzzzzz.jfif

వనదేవతలకు మొక్కుల్లో భాగంగా భక్తులు ముం దుగా జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించారు. కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించుకున్నారు. అధికారులు ఏర్పాటు చేసిన క్యూలైన్ల ద్వారా ఎత్తు బంగారం(బెల్లం) నెత్తిన మొస్తూ కాలినడకన దేవస్థానంలోని తల్లుల గద్దెలకు చేరుకున్నారు. ఆదివాసీల ఆచార సంప్రదాయాలలో చీరె, సారె, పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, కొబ్బరికాయలు, బెల్లం, ఒడిబియ్యం, యాట మొక్కులను చెల్లించుకుని తల్లీ సల్లంగా చూడు.. మహా జాతరకు వస్తాం అని వేడుకున్నారు.


meda1.2.jpg

ఈ వార్తలు కూడా చదవండి

మెరుపు వేగంతో పెరుగుతున్న పసిడి, వెండి ధరలు! నేటి రేట్స్ చూస్తే..

జగన్‌ శవయాత్ర చేసినా పట్టించుకోరు: మంత్రి సవిత

Read Latest Telangana News and National News

Updated Date - Jan 24 , 2026 | 12:11 PM