మాజీ సీఎం కేసీఆర్ ఔదార్యం.. ఏం చేశారంటే..
ABN , Publish Date - Jan 23 , 2026 | 06:00 PM
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మరోసారి ఔదార్యాన్ని చాటారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు , ఉద్యమకారుడు, ములుగు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కుసుమ జగదీశ్ కుటుంబానికి కేసీఆర్ అండగా నిలిచారు.
హైదరాబాద్, జనవరి23(ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (KCR) మరోసారి ఔదార్యాన్ని చాటారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, ఉద్యమకారుడు, ములుగు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కుసుమ జగదీశ్ కుటుంబానికి కేసీఆర్ అండగా నిలిచారు. పార్టీలో మొదటి నుంచి క్రియాశీలకంగా వ్యవహరించిన కుసుమ జగదీశ్ రెండేళ్ల క్రితం అనారోగ్యంతో కన్నుమూశారు. జగదీశ్ కుమార్తె సుకీర్తి మెడిసిన్ చదవడానికి ప్రయత్నిస్తున్న విషయం గురించి కేసీఆర్ పార్టీ నాయకుల ద్వారా తెలుసుకున్నారు.

చెక్కు అందజేత..
ఆమె మెడిసిన్ చదవడానికి అవసరమైన ఫీజు చెక్కును శుక్రవారం ఎర్రవెల్లి నివాసంలో సుకీర్తికి అందజేశారు. మంచిగా చదువుకోవాలని, ఆమె కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని సుకీర్తిని ఆశీర్వదించారు. సుకీర్తితో పాటు మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ , మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ములుగు బీఆర్ఎస్ శ్రేణులు కేసీఆర్‌ను కలిశారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ కార్యకర్తల పట్ల చూపే ఆదరణకు ఈ సంఘటన ఒక నిదర్శనమని ఆ పార్టీ నేతలు తెలిపారు. కుసుమ జగదీశ్ కుటుంబానికి అధినేత అందించిన ఈ ఆర్థిక సహాయం ఆ కుటుంబంలో కొత్త వెలుగును నింపిందని బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
మేడారం జాతరకు కేంద్ర ప్రభుత్వం భారీ సాయం
బీఆర్ఎస్ నేతకు అసెంబ్లీ స్పీకర్ నోటీసులు
Read Latest Telangana News And Telugu News