ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Narendra Modi: అభివృద్ధికి కేంద్రబిందువుగా తెలంగాణ

ABN, Publish Date - Jun 03 , 2025 | 03:42 AM

అభివృద్ధికి కేంద్ర బిందువుగా తెలంగాణ నిలుస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ‘ఎక్స్‌’ వేదికగా ఆమె శుభాకాంక్షలు తెలిపారు.

  • ‘ఎక్స్‌’ వేదికగా రాష్ట్రపతి శుభాకాంక్షలు

  • కేంద్రం సహకారంతో తెలంగాణ అభివృద్ధి: ప్రధాని మోదీ

  • ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్‌ కీలకపాత్ర: ఖర్గే, రాహుల్‌

న్యూఢిల్లీ, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి) : అభివృద్ధికి కేంద్ర బిందువుగా తెలంగాణ నిలుస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ‘ఎక్స్‌’ వేదికగా ఆమె శుభాకాంక్షలు తెలిపారు. యువ రాష్ట్రమైన తెలంగాణ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని కలిగి ఉందన్నారు. రాష్ట్ర ప్రజలు అభివృద్ధి, శ్రేయస్సు మార్గంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. దేశ పురోగతికి తెలంగాణ విశేషంగా కృషి కృషి చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దశాబ్దకాలంలో రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని ‘ఎక్స్‌’ వేదికగా గుర్తు చేశారు. రానున్న రోజుల్లో అభివృద్ధి పథంలో అత్యున్నత శిఖరాలను తెలంగాణ అధిరోహిస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా వ్యాఖ్యానించారు.


తెలంగాణ మరింతగా వికసించాలని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని ఉప రాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలకు లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెస్‌ పార్టీ కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పాటుతో కోట్లాది మంది ప్రజల కలలు నెరవేరాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన విద్యార్థులు సహా అమరవీరులను స్మరించుకున్నారు. ప్రజా తెలంగాణ నిర్మాణంలో ప్రతి పౌరుడికి మంచి భవిష్యత్తును అందించేందుకు కాంగ్రెస్‌ పనిచేస్తుందని రాహుల్‌ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

బేకరీలో దారుణం.. అందురూ చూస్తుండగానే..

చుండ్రు సమస్యకు సింపుల్ చిట్కాలు..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 03 , 2025 | 03:42 AM