Home » Telangana Formation Day
హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీఆర్‌ఎస్ కార్యాలయంలో అమరవీరులకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులర్పించారు. పుష్కర తెలంగాణ ఇప్పుడు ముష్కరుల పాలైందని మాజీ మంత్రి వ్యాఖ్యానించారు.
హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఆగస్టు 6వ తేదీన ప్రొఫెసర్ జయశంకర్ జయంతి నాటికి ఈ విగ్రహం ఏర్పాటు చేయాలని సూచించారు.
కేసీఆర్ హయాంలో నిరంకుశ వైఖరితో వ్యవహరించారని ఎమ్మెల్సీ, టీజేఎస్ అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు స్వేచ్ఛ వచ్చిందని పేర్కొన్నారు.
సంక్షేమం, అభివృద్ధికి తమ ప్రభుత్వం సమప్రాధాన్యం ఇస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రాచరికం, పెత్తనాన్ని తెలంగాణ సమాజం సహించదని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఆవిష్కరణ, పారిశ్రామిక స్ఫూర్తికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
అమరుల త్యాగాల పునాదులు మీద తెలంగాణ అవతరించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. అమరుల త్యాగాల స్పూర్తిగా సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలనను అందిస్తున్నామని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఈరోజు మూడు నోటిఫికేషన్లు ప్రకటిస్తామని.. ఇందులో రోడ్లు భవనాల శాఖలో ఈఏఈ 222, సివిల్ 49 ఉద్యోగాలు ఉన్నాయని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధ్యక్షుడు బుర్రా వెంకటేశం తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు.