Share News

మా డిమాండ్లు నెరవేర్చకపోతే ఉప్పల్ భగాయత్‌లో భూ ఉద్యమం చేస్తా: కవిత

ABN , Publish Date - Jun 02 , 2026 | 12:15 PM

హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఆగస్టు 6వ తేదీన ప్రొఫెసర్ జయశంకర్ జయంతి నాటికి ఈ విగ్రహం ఏర్పాటు చేయాలని సూచించారు.

మా డిమాండ్లు నెరవేర్చకపోతే ఉప్పల్ భగాయత్‌లో భూ ఉద్యమం చేస్తా: కవిత
Kalvakuntla Kavitha

హైదరాబాద్, జూన్ 2 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర సేన (TRS) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) డిమాండ్ చేశారు. ఆగస్టు 6వ తేదీన ప్రొఫెసర్ జయశంకర్ జయంతి నాటికి ఈ విగ్రహం ఏర్పాటు చేయాలని సూచించారు. తెలంగాణ ఆవిర్భావానికి 12 ఏళ్లు పూర్తైనా జయశంకర్ విగ్రహం ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జయశంకర్ విగ్రహాన్ని.. రేవంత్‌రెడ్డి సర్కార్ ఏర్పాటు చేయకపోతే.. తమకు ఈ విగ్రహం అనుమతి ఇవ్వాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.


ఉద్యమకారులకు తగిన గౌరవం ఇవ్వాలి..

తెలంగాణ ఉద్యమ వీరులకును కవిత స్మరించుకున్నారు. బంజారాహిల్స్ టీఆర్ఎస్ కార్యాలయంలో కవిత మీడియాతో మాట్లాడారు. ఉద్యమకారులకు తగిన గౌరవం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యమ స్ఫూర్తిని భావితరాలకు చేరవేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ కోసం పోరాడిన ప్రతి ఒక్కరినీ గుర్తించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఉద్యమ నాయకుల సేవలను ఈ ప్రభుత్వం స్మరించుకోవాలని సూచించారు. తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించిన నేతలకు గౌరవం ఇవ్వాలని కోరారు.


అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయాలి..

అమరవీరుల కుటుంబాలకు జులై 2వ తేదీలోగా న్యాయం చేయాలని కవిత డిమాండ్ చేశారు.ఈ డిమాండ్లు నెరవేర్చకపోతే ఉప్పల్ భగాయత్‌లో భూ ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పట్టించుకోకపోతే వంటా-వార్పు కార్యక్రమం చేపడతామని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమ వారసత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని చెప్పుకొచ్చారు. అమరవీరుల త్యాగాలను మరవొద్దని ఈ ప్రభుత్వానికి సూచించారు. ఉద్యమకారుల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగాలని కవిత పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ధాన్యం కొనుగోళ్లలో రేవంత్ సర్కార్ విఫలం: రాంచందర్‌రావు

బెట్టింగ్ రాకెట్‌పై సీఐడీ ఉక్కుపాదం.. 11 మంది అరెస్ట్

Read Latest  AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jun 02 , 2026 | 12:37 PM