పరేడ్ గ్రౌండ్స్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి
ABN, Publish Date - Jun 02 , 2026 | 09:43 AM
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు.
హైదరాబాద్, జూన్ 2: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. సంక్షేమం, అభివృద్ధికి ఈ ప్రభుత్వం సమప్రాధాన్యం ఇస్తోందని సీఎం అన్నారు. రాచరికం, పెత్తనాన్ని తెలంగాణ సమాజం సహించదని స్పష్టం చేశారు. తమది ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే ప్రజాప్రభుత్వమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
Updated at - Jun 02 , 2026 | 09:43 AM