ప్రజాపాలనతో తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది: మంత్రి తుమ్మల
ABN , Publish Date - Jun 02 , 2026 | 09:12 AM
అమరుల త్యాగాల పునాదులు మీద తెలంగాణ అవతరించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. అమరుల త్యాగాల స్పూర్తిగా సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలనను అందిస్తున్నామని పేర్కొన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 2 (ఆంధ్రజ్యోతి): ప్రజాపాలనతో తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Thummala Nageswara Rao) వ్యాఖ్యానించారు. అమరుల త్యాగాల పునాదులు మీద తెలంగాణ అవతరించిందని తెలిపారు. అమరుల త్యాగాల స్పూర్తిగా సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలనను అందిస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొత్తగూడెం ప్రగతి మైదానంలో జాతీయ జెండాను మంత్రి తుమ్మల ఆవిష్కరించారు. జిల్లా ప్రజలకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లా గోదావరి జలాలతో సశ్యశ్యామలం..
ఉమ్మడి ఖమ్మం జిల్లా గోదావరి జలాలతో సశ్యశ్యామలంగా మారేలా సీతారామ ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని మంత్రి తుమ్మల తెలిపారు. ఆయిల్ ఫామ్ సాగులో ఉద్యాన పంటల సాగులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అగ్ర స్థానంలో ఉందని చెప్పుకొచ్చారు. దేశానికే తలమానికంగా మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ కొత్తగూడెంలో స్థాపించామని ప్రస్తావించారు. ప్రతి రైతు నుంచి ధాన్యం కొనుగోలు చేసి ప్రజాప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. జిల్లాలో ఐదు నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు మంజూరు చేశామని తెలిపారు.

రైల్వే కనెక్టివిటీ కోసం కేంద్రప్రభుత్వానికి ప్రతిపాదన చేశాం..
జిల్లా సమగ్ర అభివృద్ధి పారిశ్రామిక ప్రగతి కోసం రహదారులు నిర్మిస్తున్నామని మంత్రి తుమ్మల వెల్లడించారు. భద్రాచలం రామాలయం దర్శనానికి వచ్చే భక్తులకు సౌకర్యం ఉండేలా రైల్వే కనెక్టివిటీ కోసం కేంద్రప్రభుత్వానికి ప్రతిపాదన చేశామని అన్నారు. కొత్తగూడెంలో ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు కోసం కేంద్రప్రభుత్వం మార్గదర్శకాలు పాటిస్తామని చెప్పారు. కొత్తగూడెం పట్టణం మున్సిపల్ కార్పొరేషన్‌గా ఏర్పాటు చేయడంతో అభివృద్ధి బాటలో పయనిస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...
ధాన్యం కొనుగోళ్లలో రేవంత్ సర్కార్ విఫలం: రాంచందర్‌రావు
బెట్టింగ్ రాకెట్‌పై సీఐడీ ఉక్కుపాదం.. 11 మంది అరెస్ట్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News