Share News

అభివృద్ధి, సంక్షేమం ధ్యేయంగా ప్రజాపాలన: మహేశ్‌ గౌడ్

ABN , Publish Date - Jun 02 , 2026 | 11:29 AM

హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.

అభివృద్ధి, సంక్షేమం ధ్యేయంగా ప్రజాపాలన: మహేశ్‌ గౌడ్
TPCC Chief Mahesh Kumar Goud

హైదరాబాద్, జూన్ 2: గాంధీభవన్‌లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... తెలంగాణ ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఏళ్ల నిరీక్షణ తర్వాత ఎంతోమంది త్యాగధనుల ప్రాణ త్యాగాలతో తెలంగాణ ఆవిర్భావం జరిగిందన్నారు. తెలంగాణ ప్రదాత సోనియా గాంధీ రాష్ట్ర ఏర్పాటుకు శ్రీకారం చుట్టారని తెలిపారు. ఎన్నో ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ సాకారమైందని మహేశ్ గౌడ్ చెప్పారు.


ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని టీపీసీసీ చీఫ్ అన్నారు. అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ప్రజాపాలన సాగుతోందన్నారు. బీజేపీ నాయకులు ప్రజలను మభ్య పెడుతున్నారని మండిపడ్డారు. మిగిలిన రెండున్నరేళ్లు తెలంగాణ నిర్మాణానికి పాటు పడదామన్నారు. సీఎం రేవంత్ నేతృత్వంలో ఎన్నికలకు వెళ్లి మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. బంగారు తెలంగాణ అన్నవారి కుటుంబం బంగారం అయ్యిందని వ్యాఖ్యానించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగుతోందని, పేదవాడి అభ్యున్నతి ధ్యేయంగా ముందుకు వెళతామని మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి..

తెలంగాణ ప్రజలకు చంద్రబాబు, పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు

హైదరాబాద్‌లో నేడు పవన్ కల్యాణ్ ప్రెస్‌‌మీట్.. ఆసక్తికర పోస్ట్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 02 , 2026 | 11:36 AM