హైదరాబాద్‌లో నేడు పవన్ కల్యాణ్ ప్రెస్‌మీట్.. ఆసక్తికర పోస్ట్
ABN , Publish Date - Jun 02 , 2026 | 10:56 AM
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. గచ్చిబౌలిలో జనసేన సభకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో నేడు ప్రెస్‌మీట్ పెడుతున్నట్లు పవన్ ప్రకటించారు.
హైదరాబాద్, జూన్ 2: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఈరోజు(మంగళవారం) సాయంత్రం ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. గచ్చిబౌలిలో జనసేన సభకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో నేడు ప్రెస్‌మీట్ పెడుతున్నట్లు పవన్ ప్రకటించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో జనసేనాని పోస్ట్ చేశారు. ప్రెస్‌మీట్‌కు అయినా పోలీసులు అనుమతి ఇస్తారా అంటూ ఎక్స్ వేదికగా పవన్ చేసిన పోస్ట్ రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ‘తెలంగాణ నవనిర్మాణ సభ’ పేరుతో జనసేనాని పవన్ కల్యాణ్ ఈరోజు గచ్చిబౌలిలో పార్టీ తెలంగాణ నాయకులతో ఓ సభను ఏర్పాటు చేశారు. ఆ సభకు అనుమతిని నిరాకరిస్తూ నిన్న(సోమవారం) సాయంత్రం పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇందులో భాగంగా పవన్ కల్యాణ్ ఈరోజు ఎక్స్‌లో ఆసక్తికర పోస్ట్ చేశారు. జూబ్లీహిల్స్ మాదాపూర్‌లోని పవన్ నివాసంలో సాయంత్రం 4:30 గంటల నుంచి 5:30 గంటల మధ్య ప్రెస్‌మీట్ నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు. ప్రెస్‌మీట్‌కైనా పోలీసులు అనుమతి ఇస్తారా.. చూద్దాం అంటూ పవన్ చేసిన పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది. తెలంగాణ జనసేన నేతలతో కలిసి పవన్ కల్యాణ్ ఈరోజు సాయంత్రం మీడియా సమావేశాన్ని నిర్వహించబోతున్నారు.
ఇవి కూడా చదవండి..
మే నెలలో రికార్డు స్థాయి దర్శనాలు
తెలంగాణ ప్రజలకు చంద్రబాబు, పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు
Read Latest Telangana News And Telugu News