Share News

మే నెలలో రికార్డు స్థాయి దర్శనాలు

ABN , Publish Date - Jun 02 , 2026 | 06:21 AM

మే నెలలో తిరుమల శ్రీవారిని రికార్డుస్థాయిలో 25.46 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. వేసవి రద్దీ దృష్ట్యా టీటీడీ మే 1వ తేదీ నుంచే వీఐపీ బ్రేక్‌ దర్శనాలను రద్దు చేయడంతో పాటు..

మే నెలలో రికార్డు స్థాయి దర్శనాలు

  • శ్రీవారిని దర్శించుకున్న 25.46 లక్షల మంది

  • తలనీలాలు సమర్పించిన 12.19 లక్షల మంది

తిరుమల, జూన్‌ 1(ఆంధ్రజ్యోతి): మే నెలలో తిరుమల శ్రీవారిని రికార్డుస్థాయిలో 25.46 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. వేసవి రద్దీ దృష్ట్యా టీటీడీ మే 1వ తేదీ నుంచే వీఐపీ బ్రేక్‌ దర్శనాలను రద్దు చేయడంతో పాటు ప్రత్యేక ప్రవేశ దర్శన కోటాను కుదించింది. తొలివారం రద్దీ మోస్తరుగానే ఉన్నప్పటికీ వరుసగా పరీక్షల ఫలితాలు వెలువడిన అనంతరం తిరుమల కొండ రద్దీగా మారిపోయింది. భక్తుల మధ్య తోపులాటలకు ఆస్కారం లేకుండా భక్తులను విడతల వారీగా క్యూలైన్లలోకి అనుమతించారు. ఏఐ ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ద్వారా అధికారులందరూ సమన్వయంతో పనిచేయడంతో మే నెలలో రికార్డుస్థాయిలో 25.46 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 24వ తేదీన అత్యధికంగా 98,058 మంది భక్తులు దర్శించుకున్నారు. హెడ్‌కౌంటర్‌ సిస్టమ్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇదే రికార్డుగా నమోదైంది. ఏడు సార్లు 90 వేలకుపైగా భక్తులకు శ్రీవారి దర్శనం చేయించగలిగారు. గత నెలలో 12.19 లక్షల మంది సమర్పించారు. అలాగే హుండీ ఆదాయం గత ఏడాది మే నెలలో 106.85 కోట్లు లభించగా గత నెలలో దాదాపు రూ.120.28 కోట్లు లభించింది.

Updated Date - Jun 02 , 2026 | 06:21 AM