సిటీ బస్సులపై ఓవర్‌లోడ్
ABN , Publish Date - Jun 02 , 2026 | 10:17 AM
ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఆర్టీసీ బస్సులు పెరగడం లేదు. మహాలక్ష్మీ ఉచిత ప్రయాణంతో బస్సులు ఇప్పటికే ఓవర్‌లోడ్‌తో పరుగులు తీస్తున్నాయి.
విద్యాసంవత్సరం ప్రారంభమైతే మరిన్ని సమస్యలు
హైదరాబాద్ సిటీ: ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఆర్టీసీ బస్సులు పెరగడం లేదు. మహాలక్ష్మీ ఉచిత ప్రయాణంతో బస్సులు ఇప్పటికే ఓవర్‌లోడ్‌తో పరుగులు తీస్తున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభమైతే ప్రధాన రూట్లలో మరిన్ని సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి. ఉప్పల్, ఘట్‌కేసర్, మొయినాబాద్, చేవెళ్ల, శంకర్‌పల్లి, మేడ్చల్, పటాన్‌చెరు వంటి ప్రాంతాల్లో సికింద్రాబాద్, మెహిదీపట్నం, ఉప్పల్, ఎల్‌బీనగర్, హయత్‌నగర్, కూకట్‌పల్లి ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సులు నడుస్తుంటాయి. రద్దీకి అనుగుణంగా సిటీ బస్సులు లేకపోవడంతో విద్యార్థులు ఫుట్ బోర్డు ప్రయాణాలు సాగిస్తూ ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి.
ప్రయాణికుల రద్దీ
మహాలక్ష్మి ఉచిత ప్రయాణాల ప్రారంభానికి ముందు కాలేజీ రూట్లలో ఉదయం మాత్రమే రద్దీ ఉండేది. ఇప్పుడు ప్రయాణికుల రద్దీ రెడింతలు పెరిగింది. విద్యార్థినుల రద్దీ కూడా కాలేజీ రూట్లలో ఒక్కసారిగా పెరిగింది. అయినా ఆర్టీసీ చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డిపోల వారీగా మేనేజర్లు సర్వేలు నిర్వహిస్తూ కళాశాలలకు వెళ్లే విద్యార్థుల రాకపోకలకు అనుగుణంగా బస్సులు పెంచాల్సిన అవసరం ఉందని ఆర్టీసీ రిటైర్ట్ ఉన్నతాధికారులు సూచిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం
సినిమా స్టైల్లో చోరీ.. క్షణాల వ్యవధిలో రూ. 5.50 లక్షలు కొట్టేశాడుగా..
Read Latest AP News And Telangana News And International News And Telugu News