తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది: ప్రధాని మోదీ
ABN , Publish Date - Jun 02 , 2026 | 09:36 AM
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఆవిష్కరణ, పారిశ్రామిక స్ఫూర్తికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.
ఢిల్లీ, జూన్ 2 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ప్రధాని పోస్టు పెట్టారు. తెలంగాణ ఆవిష్కరణ, పారిశ్రామిక స్ఫూర్తికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. ధైర్యసాహసాలు తెలంగాణ చరిత్రకు స్ఫూర్తి అని పేర్కొన్నారు. వికసిత్ భారత్‌లో తెలంగాణ పాత్ర కీలకమని చెప్పుకొచ్చారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. తెలంగాణ సంస్కృతి, వారసత్వం గొప్పదని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
తెలంగాణ ప్రజలు తమ సృజనాత్మకతకు, వ్యాపార నైపుణ్యానికి ప్రసిద్ధి చెందినవారని ప్రధాని మోదీ కొనియాడారు. ఈ రాష్ట్రం ధైర్యానికి ప్రతీకలుగా నిలిచే గొప్ప చరిత్రను, వైభవమైన సంస్కృతిని కలిగి ఉందని తెలిపారు. తెలంగాణ ప్రజలు తమ నూతన ఆవిష్కరణ, పారిశ్రామిక స్ఫూర్తికి ప్రసిద్ధి చెందారని అన్నారు. ఈ రాష్ట్రం తన అద్భుతమైన సంస్కృతి, చరిత్రకు పేరుగాంచిందని... అది ధైర్యం, సంకల్పంతో కూడినదని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ధాన్యం కొనుగోళ్లలో రేవంత్ సర్కార్ విఫలం: రాంచందర్‌రావు
బెట్టింగ్ రాకెట్‌పై సీఐడీ ఉక్కుపాదం.. 11 మంది అరెస్ట్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News