Share News

కేసీఆర్ హయాంలో నిరంకుశ వైఖరితో వ్యవహరించారు: కోదండరాం

ABN , Publish Date - Jun 02 , 2026 | 11:46 AM

కేసీఆర్ హయాంలో నిరంకుశ వైఖరితో వ్యవహరించారని ఎమ్మెల్సీ, టీజేఎస్ అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు స్వేచ్ఛ వచ్చిందని పేర్కొన్నారు.

కేసీఆర్ హయాంలో నిరంకుశ వైఖరితో వ్యవహరించారు: కోదండరాం
Kodandaram

హైదరాబాద్, జూన్ 2 (ఆంధ్రజ్యోతి): కేసీఆర్ హయాంలో నిరంకుశ వైఖరితో వ్యవహరించారని ఎమ్మెల్సీ, టీజేఎస్ అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం (Kodandaram) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు స్వేచ్ఛ వచ్చిందని పేర్కొన్నారు. నిరసన వ్యక్తం చేసుకోవటానికి కూడా ఒకప్పుడు స్వేచ్ఛ లేదని చెప్పుకొచ్చారు. రాష్ట్ర ఆకాంక్షలకి అడ్డుపడితే తాము సహించమని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సఖ్యత కూడా చాలా ముఖ్యమని వ్యాఖ్యానించారు. ఈరోజు (మంగళవారం) టీజేఎస్ కార్యాలయంలో కోదండరాం మీడియాతో మాట్లాడారు.


తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కోదండరాం ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సమసమాజ స్థాపన కోసం పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. ఈ విషయంలో సహకరిస్తే ఆహ్వానిస్తాం, కానీ తూట్లు పొడవాలని చూస్తే ఊరుకోమని అన్నారు. తెలంగాణ అస్తిత్వం, సంస్కృతిని కాపాడుకుందామని.. దీనికి ఆటంకం కలిగించే పని ఎవరు చేసిన సహించమని తెలిపారు. తాము ఎప్పుడు ఏపీ ప్రజలకు వ్యతిరేకం కాదని అన్నారు. తెలంగాణపై ఆంధ్ర పాలకుల పెత్తనాన్ని తాము వ్యతిరేకించామని చెప్పుకొచ్చారు. ఇప్పుడు చిన్న చిన్న విషయాల్లో ఏపీ నేతలు తల దూరుస్తున్నారని అన్నారు.


అప్పటి పాలకులతో కోట్లాడి రాష్ట్రం తెచ్చుకున్నామని కోదండరాం ప్రస్తావించారు. 60 ఏళ్ల నిరీక్షణ తెలంగాణ రాష్ట్రమని వ్యాఖ్యానించారు. సోనియా గాంధీ, సుశ్మాస్వరాజ్ తెలంగాణ కోసం చాలా కృషి చేశారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రజల పాత్ర ఎంత ఉందో, అభివృద్ధిలో కూడా ప్రజలు సూచనలు ఇవ్వాలని కోరారు. రాజకీయ విశ్లేషకుడు నాగేశ్వరరావు వ్యాఖ్యలు తప్పు కావొచ్చని.. కానీ ఆయనకి ఉన్న సమాచారంతో ఆయన మాట్లాడి ఉండవచ్చని అన్నారు. ఆయనకు సమాధానం చెప్పటానికి ఓ అవకాశం ఇవ్వాలని చెప్పారు. కానీ దాన్ని అడ్డుపెట్టుకొని భావ ప్రకటన స్వేచ్ఛకు ఆంధ్ర నాయకులు అడ్డుపడుతున్నారని.. ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలు సహించరని కోదండరాం పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ధాన్యం కొనుగోళ్లలో రేవంత్ సర్కార్ విఫలం: రాంచందర్‌రావు

బెట్టింగ్ రాకెట్‌పై సీఐడీ ఉక్కుపాదం.. 11 మంది అరెస్ట్

Read Latest  AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jun 02 , 2026 | 11:53 AM