Special buses: పుష్కరాలకు ప్రత్యేక బస్సులు.. ఎక్కడెక్కడి నుంచంటే..
ABN, Publish Date - May 14 , 2025 | 09:36 AM
సరస్వతీ నది పుష్కరాలకు హైదరాబాద్ నగరం నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. బుధవారం నుంచి జేబీఎస్, ఎంజీబీఎస్ల నుంచి కాళేశ్వరానికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. అంతేగాక 40 మంది ప్రయాణికులుంటే ఆ కాలనీకే బస్సు పంపిస్తామన్నామని అధికారులు తెలిపారు.
- నేటినుంచి జేబీఎస్, ఎంజీబీఎస్ల నుంచి కాళేశ్వరానికి
- 40 మంది ప్రయాణికులుంటే కాలనీకే బస్సు
హైదరాబాద్ సిటీ: సరస్వతీ నది(Saraswati River) పుష్కరాలకు జేబీఎస్, ఎంజీబీఎస్(JBS, MGBS)లతో పాటు పలు ప్రాంతాల నుంచి కాళేశ్వరానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు గ్రేటర్‌జోన్ ఈడీ ఎం.రాజశేఖర్ తెలిపారు. పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే పవిత్రమైన సరస్వతీ నది పుష్కరాలకు వెళ్లే భక్తులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: విదేశాలకు వెళ్లేవారే టార్గెట్.. కన్సల్టెన్సీ మాటున ధ్రువపత్రాల విక్రయం
మే14 నుంచి 24వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు జేబీఎస్, ఎంజీబీఎస్, ఉప్పల్, కూకట్‌పల్లి, జీడిమెట్ల, మేడ్చల్(Uppal, Kukatpally, Jeedimetla, Medchal) ప్రాంతాల నుంచి నడపనున్నట్లు ప్రకటించారు. 40 మంది ప్రయాణికులుంటే ఆ కాలనీకే బస్సు పంపిస్తామన్నారు. ప్రత్యేక బస్సుల సమాచారం కోసం 9676671533, 9959226154, 9959226160 నంబర్లలో సంప్రదించవచ్చన్నారు. వెబ్‌సైట్ www. tgsrtcbus.in ద్వారా ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోవచ్చని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
ముగిసిన యుద్ధం మిగిల్చిన ప్రశ్నలు
కృష్ణా జలాల పునఃపంపిణీ తెలంగాణ జన్మహక్కు
ఛీ.. నువ్వు భర్తవేనా.. మద్యం కోసం ఫ్రెండ్స్ వద్దకి భార్యని పంపుతావా?
నీలి చిత్రాల్లో నటిస్తే లక్షలు ఇస్తామని.. వివాహితను హోటల్‌కు పిలిపించి..!
దారుణం.. పురుషాంగం కోసుకుని ఎంబీబీఎస్ విద్యార్థి ఆత్మహత్య!
Read Latest Telangana News and National News
Updated Date - May 14 , 2025 | 09:36 AM