Share News

Hyderabad: విదేశాలకు వెళ్లేవారే టార్గెట్.. కన్సల్టెన్సీ మాటున ధ్రువపత్రాల విక్రయం

ABN , Publish Date - May 14 , 2025 | 08:48 AM

నగరంలో.. కొత్త తరహా మోసం వెలుగులోకి వచ్చింది. విదేశాలకు వెళ్లేవారే లక్ష్యంగా.. ఈ అక్రమ దందాకు తెరలేపారు. విదేశాలకు వెళ్లే వారికి నకిలీ ధ్రువపత్రాలు జారీచేసి వారినుంచి భారీగా సొమ్ములు వసూలు చేస్తున్నారు. అయితే.. ఏది ఎంతకాలం ఆగదుగా.. పాపం పండింది. మొత్తం ఈ అక్రమాల దందా మొత్తం బయటకు వచ్చింది. వివరాలిలా ఉన్నాయి.

Hyderabad: విదేశాలకు వెళ్లేవారే టార్గెట్.. కన్సల్టెన్సీ మాటున ధ్రువపత్రాల విక్రయం

- ‘నకిలీ’ ముఠా అరెస్ట్‌

- విదేశాలకు వెళ్లేవారే లక్ష్యంగా దందా

- రూ.2లక్షల నుంచి 4 లక్షలకు విక్రయం

- నలుగురు నిందితుల అరెస్టు

-108 నకిలీ ధ్రువపత్రాలు స్వాధీనం

హైదరాబాద్‌ సిటీ: విదేశాలకు వెళ్లేవారే లక్ష్యంగా.. నగరంలో నకిలీ ధ్రువపత్రాలను విక్రయిస్తున్న ముఠాను సౌత్‌ ఈస్టు జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి దేశంలోని వివిధ యూనివర్సిటీలకు చెందిన 108 నకిలీ సర్టిఫికెట్స్‌ స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్‌ అడిషనల్‌ డీసీపీ అందె శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం చాంద్రాయణగుట్టకు చెందిన మహ్మద్‌ ముజీబ్‌ హుస్సేన్‌ మెహిదీపట్నంలో ఎడ్యుకేషన్‌ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నాడు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ఇక.. ఇంటి వద్దకే వైద్య సేవలు


ఉన్నత విద్య, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లే వారికి వీసా ప్రొవైడ్‌ చేస్తున్నాడు. ఈ క్రమంలో కొంతమంది విద్యార్థులకు అవసరమయ్యే అదనపు విద్యార్హతలకు చెందిన ధ్రువపత్రాలను సమకూరుస్తున్నాడు. కోల్‌కతాకు చెందిన మనోజ్‌ విశ్వాస్‌, మీరట్‌కు చెందిన రవీందర్‌, ముఖేష్‌, రవీందర్‌, అజయ్‌ నకిలీ పత్రాలను కొనుగోలు చేసి నగరంలోని అవరసమైన అభ్యర్థులకు విక్రయిస్తున్నారు. ఈక్రమంలో మహ్మద్‌ నాసీర్‌ ఖాన్‌, మహ్మద్‌ ఆల్‌ బషీర్‌ రహమాని, జియా ఉర్‌ రహమాన్‌ సిద్దిఖీలను మధ్యవర్తులుగా ఏర్పాటు చేసుకున్నారు.


city4.2.jpg

ధ్రువపత్రాలు అవసరమైన అభ్యర్థులను గుర్తించి వారికి నకిలీవి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. విద్యార్హతలను బట్టి ఒక్కో సర్టిఫికెట్‌ను రూ.2లక్షల నుంచి 4 లక్షల వరకు విక్రయిస్తున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. మెహిదీపట్నం పరిధిలోని ఫస్ట్‌ లాన్సర్‌ ఈద్గా గ్రౌండ్‌లో నకిలీ పత్రాలు విక్రయిస్తున్నట్లు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు విశ్వసనీయ సమాచారం అందింది. ఇన్‌స్పెక్టర్‌ సైదాబాబు బృందం రంగంలోకి దిగి నలుగురు నిందితులను పట్టుకుంది. వారిని విచారించి మాజిద్‌ హుస్సేన్‌ కన్సల్టెన్సీలో సోదాలు చేసి దేశంలోని వివిధ యూనివర్సిటీలకు చెందిన 108 నకిలీ సర్టిఫికెట్స్‌ స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి

ముగిసిన యుద్ధం మిగిల్చిన ప్రశ్నలు

కృష్ణా జలాల పునఃపంపిణీ తెలంగాణ జన్మహక్కు

ఛీ.. నువ్వు భర్తవేనా.. మద్యం కోసం ఫ్రెండ్స్ వద్దకి భార్యని పంపుతావా?

నీలి చిత్రాల్లో నటిస్తే లక్షలు ఇస్తామని.. వివాహితను హోటల్‌కు పిలిపించి..!

దారుణం.. పురుషాంగం కోసుకుని ఎంబీబీఎస్ విద్యార్థి ఆత్మహత్య!

Read Latest Telangana News and National News

Updated Date - May 14 , 2025 | 08:48 AM