ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

PM Modi: పోలవరంపై 28న ప్రధాని సమీక్ష

ABN, Publish Date - May 17 , 2025 | 03:18 AM

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలిసారి సమీక్ష జరుపనున్నారు.

  • వర్చువల్‌గా హాజరుకానున్న తెలంగాణ,

  • ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌‌‌గఢ్‌, ఒడిశా సీఎంలు

  • ముంపు ప్రాంతాలను గుర్తించి

  • తగిన చర్యలు తీసుకోవాలంటున్న తెలంగాణ

హైదరాబాద్‌, అమరావతి, మే 16 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలిసారి సమీక్ష జరుపనున్నారు. ఈ నెల 28వ తేదీన ఆంధ్ర, తెలంగాణ సీఎంలతో పాటు ఒడిసా, ఛత్తీస్‌‌‌గఢ్‌ ముఖ్యమంత్రులు, ఆయా రాష్ట్రాల జల వనరుల మంత్రులు, అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణతో పాటు ఒడిశా, ఛత్తీస్‌‌‌గఢ్‌ రాష్ట్రాలు ముంపుపై అభ్యంతరాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లే అవకాశాలున్నాయి. దీనిపై ఆయన ఎలా స్పందిస్తారోనన్న ఆసక్తి నెలకొంది.


తెలంగాణ అభ్యంతరాలు ఇవే

పోలవరం బ్యాక్‌ వాటర్‌ ముంపుపై కొన్నేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. బ్యాక్‌ వాటర్‌ ముంపు ప్రాంతాలను గుర్తించి, తగిన చర్యలు తీసుకోవాలని కోరుతోంది. ఏపీ అందించిన డేటా ప్రకారం పోలవరం ప్రాజెక్టు అథారిటీ వెనువెంటనే క్షేత్రస్థాయిలో సర్వే చేసి, వాస్తవాలు నిగ్గుతేల్చి, రక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ కోరుతోంది. సీడబ్ల్యూసీ నివేదికను అనుసరించి ఎన్‌జీటీ ఇచ్చిన తీర్పు ప్రకారం కిన్నెరసాని, ముర్రేడువాగుల ప్రవాహాలపై గోదావరి బ్యాక్‌వాటర్‌ వల్ల పడే ప్రభావం అంచనా వేసి, పోలవరం బ్యాక్‌వాటర్‌ ముంపు నివారణకు రక్షణ చర ్యలు తీసుకోవాలని, రక్షణ గోడల నిర్మాణం చేపట్టాలని కోరుతోంది. భద్రాచలంలో నీటి నిల్వలను పరిశీలించాలని, చారిత్రక భద్రాద్రి ఆలయం, మణుగూరు భారజల ప్లాంట్‌ రక్షణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి

Vamsi Remand News: వంశీకి రిమాండ్‌లో మరో రిమాండ్

Minister Lokesh: రెన్యూవబుల్ పరిశ్రమ మాత్రమే కాదు.. ఉద్యమం

Liquor Scam Arrests: ఏపీ లిక్కర్‌ స్కాంలో మరిన్ని అరెస్ట్‌లు.. జోరుగా చర్చ

Amaravati: ప్రమాదకరంగా అమరావతి కరకట్ట రోడ్డు

For More AP News and Telugu News

Updated Date - May 17 , 2025 | 03:18 AM