Medical Colleges: వైద్య కళాశాలల్లో 607 కొలువుల భర్తీ
ABN, Publish Date - Jun 29 , 2025 | 04:02 AM
రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ కోసం మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది.
అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్
విడుదల చేసిన రిక్రూట్‌మెంట్ బోర్డు
వైద్య కాలేజీల్లో తీరనున్న అధ్యాపకుల కొరత
హైదరాబాద్, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ కోసం మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది. తగిన అర్హతలు ఉన్న అభ్యర్ధులు జూలై 10 నుంచి 17వ తేదీన సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు వైద్య విద్యలో పీజీ లేదా సూపర్ స్పెషాలిటీ కోర్సు చేసి ఉండాలి. తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్టర్ చేసుకొని ఉండాలి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేసేవారు ఎక్స్‌పీరియెన్స్ సర్టిఫికెట్ జత చేయాలి. ఎంపికైనవారు ప్రైవేటు ప్రాక్టీస్ చేయడానికి వీల్లేదు. అభ్యర్థులకు ఈ ఏడాది జూలై 1 నాటికి 46 ఏళ్లకు మించి వయసు ఉండకూడదు. మరోవైపు మెడికల్ కాలేజీలకు ప్రభుత్వం కొత్తగా 715 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను మంజూరు చేసింది. దీనికి ఆర్థికశాఖ అనుమతలు ఇచ్చింది. ఆ పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. వైద్య కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి రాత పరీక్ష ఉండదు. పీజీ మార్కులు, వెయిటేజీ మార్కుల ఆధారంగా పాయింట్స్ కేటాయిస్తారు. వివరాలను www.mhsrb.telangana.gov.in లో తెలుసుకోవచ్చని బోర్డు పేర్కొంది.
భర్తీ చేసే పోస్టులు ఇవే..
34 వైద్య విద్య కళాశాలల్లో మొత్తం 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మల్టీజోన్-1లో 379 పోస్టులు, మల్టీజోన్-2లో 228 పోస్టులున్నాయి. గైనకాలజీ విభాగంలో అత్యధికంగా 90 పోస్టులుండగా.. జనరల్ మెడిసిన్ 47, జనరల్ సర్జరీ 43, అనస్తీషియా 44, ిపీడియాట్రిక్స్‌లో 28, రేడియో డయాగ్నసిస్ 21, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ 21, ఫార్మకాలజీ 28, ఫోరెన్సిక్ మెడిసిన్ 21, కమ్యూనిటీ మెడిసిన్ 25, బయోకెమిస్ట్రీ 18, ఫిజియాలజీ 29, అనాటమీ 22, మైక్రోబయాలజీ 15, పాథాలజీ 15, ఎమర్జెన్సీ మెడిసిన్ 15, సీటీ సర్జరీ 14, ఆర్థోపెడిక్స్ 12 పోస్టులతోపాటు మరికొన్ని విభాగాల్లోనూ భర్తీ చేయనున్నారు.
ఇవి కూడా చదవండి
పాత బాకీ అడిగితే ఇలా కొడతారా..
మహా న్యూస్ పై దాడిని తీవ్రంగా ఖండించిన చంద్రబాబు, లోకేష్
Updated Date - Jun 29 , 2025 | 04:02 AM