Attack on Mahaa News: మహా న్యూస్ పై దాడిని తీవ్రంగా ఖండించిన చంద్రబాబు, లోకేష్
ABN , Publish Date - Jun 28 , 2025 | 06:50 PM
తెలుగు న్యూస్ ఛానల్ మహా న్యూస్ హైదరాబాద్ ప్రధాన కార్యాలయంపై దుండగులు దాడి చేశారు. కర్రలు, రాళ్లతో ఆఫీస్ మీదకి తెగబడి బిల్డింగ్ అద్దాలు, కార్ల అద్దాలు పగులగొట్టారు. కర్రలతో ఆఫీస్ లోకి చొరబడేందుకు ప్రయత్నించారు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
హైదరాబాద్, 28 జూన్: తెలుగు న్యూస్ టీవీ ఛానల్ 'మహా న్యూస్' హైదరాబాద్ ప్రధాన కార్యాలయంపై దుండగులు దాడి చేశారు. కర్రలు, రాళ్లతో ఆఫీస్ మీద దాడి చేసి బిల్డింగ్ అద్దాలు, కార్ల అద్దాలు పగులగొట్టారు. కర్రలతో ఆఫీస్ లోకి చొరబడేందుకు ప్రయత్నించారు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు.
ఏపీ సీఎం చంద్రబాబు ఈ ఘటనపై సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం ట్విట్టర్లో స్పందించారు. ' హైదరాబాద్ మహా టీవీ హెడ్ ఆఫీసుపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజావాణి వినిపించే మీడియాపై దాడి ప్రజాస్వామ్యంపై దాడిగానే పరిగణించాలి. మహా టీవీపై దాడి చేసినవారిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. కథనాలు,ప్రసారాల పట్ల అభ్యంతరాలు ఉంటే, తెలియజేయవచ్చు. వివరణ కోరవచ్చు, ఖండన అడగవచ్చు. ఇటువంటి దాడులు క్షమార్హం కాదు. మహా యాజమాన్యానికి సంఘీభావం తెలుపుతున్నాను.' అని చంద్రబాబు అన్నారు.
ఇక, మంత్రి నారా లోకేష్ కూడా మహాన్యూస్ పై దాడిని ఖండించారు. 'తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ మీడియా ఛానల్ మహా న్యూస్ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడిని ఖండిస్తున్నాను. హైదరాబాద్ లోని ఛానల్ కార్యాలయంపై దుండగులు దాడి చేసి విధ్వంసం సృష్టించడం దారుణం. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు చోటు లేదు. బెదిరింపులు, దాడులతో మీడియాను కట్టడి చేయాలనే ఆలోచన మంచిది కాదు. ప్రజలు, సమాజం దీన్ని ఆమోదించరు. మహా న్యూస్ యాజమాన్యానికి, సిబ్బందికి, జర్నలిస్టులకు సంఘీభావం తెలుపుతున్నాను.' అని లోకేష్ అన్నారు.
ఇవి కూడా చదవండి..
కెనడాపై ట్రంప్ ఆగ్రహం.. వాణిజ్య చర్చలు ముగిస్తున్నట్టు ప్రకటన
అమెరికా సుప్రీంకోర్టులో ట్రంప్‌నకు భారీ విజయం
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి