అమెరికా సుప్రీంకోర్టులో ట్రంప్‌నకు భారీ విజయం
ABN , Publish Date - Jun 28 , 2025 | 05:10 AM
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు శుక్రవారం సుప్రీంకోర్టులో భారీ విజయం లభించింది. ఫెడరల్ ప్రభుత్వం జారీ చేసే ఆదేశాలను దేశవ్యాప్తంగా నిలుపుదల చేస్తూ ఏకన్యాయమూర్తి
డిస్ట్రిక్ట్ కోర్టుల పరిధిపై స్పష్టత
ఫెడరల్ ప్రభుత్వ ఆదేశాలను దేశవ్యాప్తంగా అడ్డుకోలేవని ప్రకటన
వాషింగ్టన్, జూన్ 27: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు శుక్రవారం సుప్రీంకోర్టులో భారీ విజయం లభించింది. ఫెడరల్ ప్రభుత్వం జారీ చేసే ఆదేశాలను దేశవ్యాప్తంగా నిలుపుదల చేస్తూ ఏకన్యాయమూర్తి ఆధ్వర్యంలో పనిచేసే కోర్టులు ఆదేశాలు ఇవ్వలేవని, వాటికి ఆ అధికారం లేదని స్పష్టం చేసింది. ట్రంప్ జారీ చేసిన ఆదేశాలను ఇటీవల కాలంలో పలు డిస్ట్రిక్ట్ జడ్జి కోర్టులు అడ్డుకుంటున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ ఆదేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. ముఖ్యంగా జన్మతఃపౌరసత్వ విధానాన్ని రద్దు చేస్తూ ఆయన ఇచ్చిన ఉత్తర్వులను డిస్ట్రిక్ట్ కోర్టులు నిలుపుదల చేశాయి. అయితే, కోర్టు తీర్పు నేపథ్యంలో జన్మతః పౌరసత్వం విషయమై ఆయన ఇచ్చిన ఆదేశాలు చెల్లుబాటు అవుతాయా, లేదా అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఆ ఆదేశాలను పలు రాష్ట్రాలు వ్యతిరేకిస్తుండడమే ఇందుకు కారణం.
ఇరాన్‌కు అమెరికా ఆర్థిక సాయం!
న్యూఢిల్లీ, జూన్ 27: ఇరాన్‌లో పౌర అణు కార్యక్రమంలో భాగంగా అణు విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి సుమారు రూ.2.5 లక్షల కోట్లు (30 బిలియన్ డాలర్లు) సాయం అందించాలని ట్రంప్ యంత్రాంగం భావిస్తోంది. అంతేకాదు ఇరాన్‌పై గతంలో విధించిన పలు ఆంక్షలను తొలగించడంతోపాటు ఆ దేశానికి సంబంధించి స్తంభింపజేసిన రూ.51 వేల కోట్ల (6 బిలియన్ డాలర్లు) నిధులను విడుదల చేసేందుకూ సిద్ధమైంది. అమెరికా ప్రత్యేక దౌత్యవేత్త స్టీవ్ విట్కాఫ్, గల్ఫ్ దేశాల ప్రతినిధులతో జరిగిన సుదీర్ఘ చర్చల్లో ఈ మేరకు ప్రతిపాదన వచ్చిందంటూ సీఎన్‌ఎన్ వార్తా సంస్థ తెలిపింది.