Share News

Viral Video: పాత బాకీ అడిగితే ఇలా కొడతారా..

ABN , Publish Date - Jun 28 , 2025 | 07:01 PM

Viral Video: పాత బాకీ చెల్లిస్తే గానీ పని చేసిపెట్టనని అలీ తేల్చి చెప్పాడు. దీంతో నసిమ్ కోపం కట్టలు తెంచుకుంది. అలీతో గొడవ పెట్టుకున్నాడు. అతడి గడ్డం పట్టుకుని లాగుతూ దాడికి దిగాడు.

Viral Video: పాత బాకీ అడిగితే ఇలా కొడతారా..
Viral Video

పాత బాకీ తీర్చమని అడిగినందుకు ఓ వ్యక్తి కంప్యూటర్ షాపు యజమానిపై దాడికి దిగాడు. అతడి గడ్డం పట్టుకుని లాగుతూ దారుణంగా వ్యవహరించాడు. షాపు అతనికి ఉపాధి కల్పిస్తున్న కంప్యూటర్‌ను ధ్వంసం చేశాడు. ఈ సంఘటన బంగ్లాదేశ్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. బంగ్లాదేశ్, గియోర్‌కు చెందిన అలీ అజామ్ మానిక్ స్థానికంగా ఓ కంప్యూటర్ షాపు నిర్వహిస్తున్నాడు. నసిమ్ భూయన్ అనే వ్యక్తి తరచుగా ఆ షాపుకు వచ్చేవాడు.


తనకు అవసరమైన పని చేయించుకునే వాడు. అయితే, డబ్బులు ఇవ్వకుండానే అక్కడినుంచి వెళ్లిపోయే వాడు. సోమవారం రాత్రి 9 గంటల సమయంలో నసిమ్ కంప్యూటర్ షాపుకు వచ్చాడు. తన పని చేసి పెట్టమని అలీ అజామ్ మానిక్‌ను అడిగాడు. అయితే, పాత బాకీ చెల్లిస్తే గానీ పని చేసిపెట్టనని అలీ తేల్చి చెప్పాడు. దీంతో నసిమ్ కోపం కట్టలు తెంచుకుంది. అలీతో గొడవ పెట్టుకున్నాడు. అతడి గడ్డం పట్టుకుని లాగుతూ దాడికి దిగాడు.


అంతేకాదు.. 10 వేల రూపాయలు విలువ చేసే కంప్యూటర్ మానిట‌ర్‌ను కూడా ధ్వంసం చేశాడు. షాపులో ఉన్న మరికొంతమంది కస్టమర్లు నసిమ్‌ను ఆపారు. దీంతో గొడవ సద్దుమణిగింది. నసిమ్ దాడిలో అలీ గాయపడ్డాడు. అతడ్ని గియోర్ అప్‌జిల్లా హెల్త్ కాంప్లెక్స్‌కు చికిత్స కోసం తరలించారు. చికిత్స అనంతరం అలీ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. నసిమ్‌పై ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. నసిమ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

ఆత్మాహుతి దాడి.. 16 మంది పాక్ ఆర్మీ జవాన్లు మృతి

మైగ్రేన్‌తో బాధపడుతున్నారా? కోక్‌తో చెక్ పెట్టండి..

Updated Date - Jun 28 , 2025 | 07:01 PM