Coke Migraine Hack: మైగ్రేన్‌తో బాధపడుతున్నారా? కోక్‌తో చెక్ పెట్టండి..
ABN , Publish Date - Jun 28 , 2025 | 04:31 PM
Coke Migraine Hack: కొంతమంది మైగ్రేన్ బాధితులు వెలుతురు, శబ్ధాల కారణంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. మైగ్రేన్ ఎంతలా వేధిస్తుందంటే.. ఆ బాధ భరించలేక ప్రాణాలు తీసుకున్న వారు కూడా ఉన్నారు.
నేడు ప్రపంచ జనాభాలో 14 నుంచి 15 శాతం మంది మైగ్రేన్ సమస్యతో బాధపడుతున్నారు. మైగ్రేన్ కారణంగా రోజు వారి పనులు సరిగా చేసుకోలేక.. ఉద్యోగాలకు వెళ్లలేక అల్లాడిపోతున్న వారు చాలా మందే ఉన్నారు. తరచుగా డాక్టర్ల చుట్టూ తిరుగుతూ ఆర్ధికంగా కూడా నష్టపోతున్నారు. డాక్టర్ల చుట్టూ తిరిగినా మైగ్రేన్ నుంచి పూర్తిగా బయటపడేవాళ్ల సంఖ్య చాలా తక్కువగా ఉంటోంది. ఇలాంటి సమయంలో డాక్టర్లు కూడా చేయలేని పని కోకాకోలా కూల్ డ్రింక్ చేస్తోంది.
మైగ్రేన్ సమస్యతో బాధపడేవాళ్లు చాలా మంది కోకాకోలా కూల్ డ్రింక్ తాగి ఉపసమనం పొందుతున్నారు. కోకాకోలా మైగ్రేన్ నుంచి తక్షణ ఉపసమనాన్ని ఇస్తోంది. దీన్ని డాక్టర్లు సైతం ధ్రువీకరిస్తున్నారు. డాక్టర్ కే కెన్నిస్ దీనిపై మాట్లాడుతూ.. ‘కోక్ లోని కెఫైన్ నరాల పనితీరుకు అంతరాయం కలిగిస్తుంది. కొన్ని సార్లు ఆ అంతరాయం పాజిటివ్‌గా పని చేస్తుంది’ అని అన్నారు. అయితే, కోక్ థెరపీ అందరికీ వర్కవుట్ అవ్వదట. కొంతమంది మైగ్రేన్ బాధితులు మాత్రమే కోక్ తాగి రిలీఫ్ పొందుతున్నారు.
మైగ్రేన్ అంటే ఏమిటి? ఎందుకు వస్తుంది?
మైగ్రేన్ అనేది ఓ న్యూరలాజికల్ సమస్య. ఈ సమస్య కారణంగా తరచుగా తలనొప్పి వస్తూ ఉంటుంది. ఆ తలనొప్పి కారణంగా వికారం, వాంతులు అయ్యే అవకాశం ఉంటుంది. కొంతమంది మైగ్రేన్ బాధితులు వెలుతురు, శబ్ధాల కారణంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. మైగ్రేన్ ఎంతలా వేధిస్తుందంటే.. ఆ బాధ భరించలేక ప్రాణాలు తీసుకున్న వారు కూడా ఉన్నారు. మైగ్రేన్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. జెనెటిక్స్, హార్మోన్లలో మార్పులు, ఒత్తిడి వంటివి ప్రధాన కారకాలుగా ఉన్నాయి.
ఇవి కూడా చదవండి
పాత ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల నుంచి బంగారం ఎలా తీస్తారంటే..