Gold From Old Phones: పాత ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల నుంచి బంగారం ఎలా తీస్తారంటే..
ABN , Publish Date - Jun 28 , 2025 | 03:44 PM
Gold From Old Phones: సెల్ ఫోన్స్, ల్యాప్‌టాప్స్‌లలోని కనెక్టర్స్, సర్క్యూట్ బోర్డ్ కాంటాక్ట్స్, ఇంటర్నల్ వైరింగ్‌లో చిన్న మొత్తంలో గోల్డ్ ఉంటుంది. ముందుగా వాటిని వేరు చేసుకోవాలి. ఆ తర్వాత మూడు దశల్లో స్వచ్ఛమైన బంగారాన్ని మన సొంతం చేసుకోవచ్చు..
ఈ డిజిటల్ యుగంలో ఎలక్ట్రానిక్ వస్తువుల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా భారత్ వంటి జనాభా అధికంగా ఉన్న దేశాల్లో ఎలక్ట్రానిక్ వస్తువుల వాడకం రోజు రోజుకు పెరుగుతూ పోతోంది. ఈ నేపథ్యంలోనే ఈ వేస్ట్ కూడా పెరుగుతోంది. యూఎన్ గ్లోబల్ ఈ వేస్ట్ మానిటర్ (GEM) ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఈ వేస్ట్ ఐదు రెట్లు వేగంగా పెరుగుతోంది. ఒక్క 2022లోనే 62 మిలియన్ టన్నుల ఈ వేస్ట్ తయారైంది. 2010 కంటే 2022లో 82 శాతం ఈ వేస్ట్ పెరిగింది. 2030 నాటికి ఇది మరింత పెరిగే అవకాశం ఉంది.
ఈ వేస్ట్ 32 శాతం పెరిగి 82 మిలియన్ టన్నులకు చేరుకునే అవకాశం ఉంది. ఈ వేస్ట్ కారణంగా పర్యావరణానికి నష్టం కలగటమే కాదు.. ఎంతో విలువైన వనరులు పనికి రాకుండా పోతున్నాయి. ఈ నేపథ్యంలోనే శాస్త్రవేత్తలు దీనికి ఓ పరిష్కారం కనుగొన్నారు. ఓ కొత్త, సురక్షితమైన పద్దతిలో ఈ వేస్ట్ నుంచి బంగారం వెలికి తీయవచ్చు. మొత్తం మూడు దశల్లో ఈ వేస్ట్ నుంచి బంగారాన్ని బయటకు తీయొచ్చు. ఆ మూడు దశలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
సెల్ ఫోన్స్, ల్యాప్‌టాప్స్‌లలోని కనెక్టర్స్, సర్క్యూట్ బోర్డ్ కాంటాక్ట్స్, ఇంటర్నల్ వైరింగ్‌లో చిన్న మొత్తంలో గోల్డ్ ఉంటుంది. ముందుగా వాటిని వేరు చేసుకోవాలి. ఆ తర్వాత..
1) గోల్డ్ డిసల్యూషన్
ట్రైక్లోరోఐసోసైన్యూరిక్ యాసిడ్‌ను ఉపయోగించి ఈ వేస్ట్‌లోని బంగారాన్ని కరిగిస్తారు.
2) గోల్డ్ బైండింగ్
పాలిసల్ఫైడ్ పాలిమర్ సర్బెంట్‌ను ఉపయోగించి కరిగిన బంగారాన్ని ఒక చోటుకు తెస్తారు.
3) గోల్డ్ రికవరీ
చివరగా పైరోలైజింగ్ లేదా డీపోలిమరైజింగ్ ద్వారా పాలిమర్స్ నుంచి స్వచ్ఛమైన బంగారాన్ని బయటకు తీస్తారు.
ఇవి కూడా చదవండి
మరోసారి వారెన్ బఫెట్ భూరి విరాళం.. గేట్స్ ఫౌండేషన్‌కు రూ.50 వేల కోట్లు..