Share News

Warren Buffett: మరోసారి వారెన్ బఫెట్ భూరి విరాళం.. గేట్స్ ఫౌండేషన్‌కు రూ.50 వేల కోట్లు..

ABN , Publish Date - Jun 28 , 2025 | 03:15 PM

ప్రపంచ కుబేరుల్లో ఒకరైన వారెన్ బఫెట్ మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. దాతృత్వంలో తనను మించిన వారు మరొకరు లేరని నిరూపించుకున్నారు. తాజాగా ఆయన మరోసారి భూరి విరాళం అందించారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ నిర్వహిస్తున్న గేట్స్ ఫౌండేషన్‌కు వేల కోట్ల రూపాయల సహాయాన్ని అందించారు.

Warren Buffett: మరోసారి వారెన్ బఫెట్ భూరి విరాళం.. గేట్స్ ఫౌండేషన్‌కు రూ.50 వేల కోట్లు..
Warren Buffett

ప్రపంచ కుబేరుల్లో ఒకరైన వారెన్ బఫెట్ (Warren Buffett) మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. దాతృత్వంలో (Donation) తనను మించిన వారు మరొకరు లేరని నిరూపించుకున్నారు. తాజాగా ఆయన మరోసారి భూరి విరాళం అందించారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ నిర్వహిస్తున్న గేట్స్ ఫౌండేషన్‌ (Gates Foundation)కు వేల కోట్ల రూపాయల సహాయాన్ని అందించారు. బఫెట్ ఇప్పటివరకు అందించిన విరాళాల్లో ఇది అతిపెద్ద వార్షిక విరాళంగా నిలిచింది.


గేట్స్ ఫౌండేషన్‌తో మరో నాలుగు కుటుంబ ఛారిటీ సంస్థలకు విరాళంగా వారన్ బఫెట్ 6 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.50 వేల కోట్లు) విలువైన బెర్క్‌షైర్ హాత్ వే (Berkshire Hathaway) షేర్లను అందించారు. తాజా విరాళంలో గేట్స్ ఫౌండేషన్‌కు 9.43 మిలియన్ షేర్లు, సుసాన్ థాంప్సన్ బఫెట్ ఫౌండేషన్‌కు 9.4 లక్షల షేర్లు, బఫెట్ పిల్లలు హోవార్డ్, సూసీ, పీటర్ నిర్వహిస్తున్న మూడు ఛారిటీ సంస్థలకు మొత్తంగా 6.6 లక్షల షేర్లు కేటాయించారు. దాదాపు రెండు దశాబ్దాల నుంచి బఫెట్ ఇలాంటి భూరి విరాళాలను అందిస్తూనే ఉన్నారు.


బెర్క్‌షైర్ హాత్ వే అనేది వారెన్ బఫెట్‌కు చెందిన పెట్టుబడుల సంస్థ. తాజాగా 6 బిలియన్ డాలర్ల షేర్లను వదులుకున్న తర్వాత కూడా ఈ సంస్థలో బఫెట్ వాటా ఇంకా 13.8 శాతం ఉంది. ఈ విరాళానికి ముందు బఫెట్ నికర సంపద 152 బిలియన్ డాలర్లు. అయితే ఈ విరాళం తర్వాత బఫెట్ సంపద తగ్గడంతో పాటు ప్రపంచ కుబేరుల జాబితాలో ఆయన ఐదో స్థానం నుంచి ఆరో స్థానానికి వచ్చేస్తారు. ప్రస్తుతం 94 ఏళ్ల వయసులో ఉన్న బఫెట్ 2006 నుంచి విరాళాలను అందిస్తున్నారు.


ఇవీ చదవండి:

మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడా.. ఈ తప్పు అస్సలు చేయొద్దు

ఇల్లు కొనాలనుకుంటున్నారా.. ఈ 6 టిప్స్ తప్పనిసరిగా ఫాలో కావాలి

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 28 , 2025 | 03:15 PM