ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

KCR - Kavitha: కేసీఆర్‌కు కవిత సంచలన లేఖ

ABN, Publish Date - May 22 , 2025 | 07:27 PM

కేసీఆర్‌కు సంచలన లేఖ రాశారు కవిత. ఈ లేఖలో బీజేపీతో బీఆర్ఎస్ దోస్తీ వ్యవహారాన్ని పరోక్షంగా ప్రస్తావించారు కవిత. ఇంకా ఈ లేఖలో ఆమె ఏమన్నారు.. కేసీఆర్‌కు ఎలాంటి ప్రశ్నలు సంధించారనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

Kavitha Letter to KCR

హైదరాబాద్, మే 22: తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అధినేత, తన తండ్రి కేసీఆర్ తీరుపట్ల ఎమ్మెల్సీ కవిత ధిక్కార స్వరం వినిపించారు. పార్టీ తీరుపై నేరుగా కేసీఆర్‌కే ప్రశ్నలు సంధించారు కవిత. తన సందేహాలను వ్యక్తం చేస్తూ గురువారం నాడు కేసీఆర్‌కు సంచలన లేఖ రాశారు కవిత. ఈ లేఖలో బీజేపీతో బీఆర్ఎస్ దోస్తీ వ్యవహారాన్ని పరోక్షంగా ప్రస్తావించారు కవిత. ఇంకా ఈ లేఖలో ఆమె ఏమన్నారు.. కేసీఆర్‌కు ఎలాంటి ప్రశ్నలు సంధించారనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..


బీఆర్ఎస్ నిర్ణయాలు, వ్యవహారాలపై సూటిగా ప్రశ్నలు సంధిస్తూ పార్టీ అధినేత కేసీఆర్‌కు లేఖ రాశారు ఎమ్మెల్సీ కవిత. పార్టీ లీడర్స్‌కి యాక్సెస్ ఇవ్వడం లేదంటూ కవిత తన లేఖలో ఆరోపించారు. మై డియర్ డాడీ అంటూ కేసీఆర్‌కు లేఖ రాసిన కవిత.. బీజేపీతో బీఆర్ఎస్ వ్యవహరిస్తున్న తీరుపై తన సందేహాలను వ్యక్తం చేశారు. బీజేపీతో పొత్తు అంశంపై సిల్విర్ జూబ్లీ సభలో కూడా క్లారిటీ ఇవ్వలేదన్నారు. బీజేపీ మీద రెండు నిమిషాలే మాట్లాడారని.. ఆ పార్టీపై ఇంకా బలంగా మాట్లాడాల్సిందని కవిత అభిప్రాయపడ్డారు. బీజేపీతో బీఆర్‌ఎస్‌ పొత్తు పెట్టుకుంటారేమో అనే చర్చ మొదలైందన్నారు కవిత. తాను సఫర్‌ అయ్యాను కదా.. బహుశా అందుకని కావొచ్చు అని కవిత తన లేఖలో పేర్కొన్నారు. బీజేపీని ఇంకొంచెం టార్గెట్‌ చేయాల్సిందని కవిత తన అభిప్రాయాన్ని వ్యక్త పరిచారు.


బీజేపీకి హెల్ప్ చేశామనే..

కాంగ్రెస్‌పై గ్రాస్‌రూట్స్‌లో నమ్మకం పోయిందన్న కవిత.. బీజేపీ ఆల్టర్‌నేటివ్‌ అనే ఆలోచనను మన కేడర్‌ చెబుతోందన్నారు. ‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం పోటీ చేయకుండా.. బీజేపీకి హెల్ప్‌ చేశామనే మెసేజ్‌ కాంగ్రెస్‌ బలంగా తీసుకెళ్లింది. కేసీఆర్ యాక్సెస్‌ దొరకడం లేదని, సెలెక్టివ్‌ యాక్సెస్‌ అని జడ్పీటీసీ, జడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్యే స్థాయి నేతలు బాధపడుతున్నారు. అందరికి అందుబాటులో ఉండేలా ప్రయత్నించండి. వరంగల్‌ సభలో ఉద్యమ నేతలకు సరైన ప్రాధాన్యం దక్కలేదు. 2001 నుంచి మీతో ఉన్నవారికి మాట్లాడే అవకాశం ఇస్తే బావుండేది. పాత ఇన్‌చార్జ్‌లకే బాధ్యతలు ఇవ్వడం కూడా కేడర్‌కు నచ్చలేదు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నవారికి.. నేరుగా పార్టీ ఆఫీసు నుంచే బీ ఫామ్స్‌ ఇవ్వాలి. వరంగల్‌ సభలో ఉర్దూలో మాట్లాడలేదు, వక్ఫ్‌ బిల్లుపై మాట్లాడలేదు. ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42 శాతం అంశాన్ని విస్మరించారు.’ అని కవిత తన లేఖలో సంచలన అంశాలను ప్రస్తావించారు.


ముందే చెప్పిన కాంగ్రెస్ నాయకులు..

వాస్తవానికి కవిత అమెరికాకు వెళ్లడానికి ముందే కేసీఆర్‌కు లేఖ రాసినట్లు కాంగ్రెస్ నేత సామ రామ్ మోహన్ రెడ్డి ఆరోపించారు. ప్రెస్‌మీట్ పెట్టి మరీ ఈ అంశాన్ని హైలెట్ చేశారు. ఇప్పుడు ఆ లేఖ వ్యవహారం నిజమని తేలింది. లేఖలో పేర్కొన్న అంశాలను పరిశీలిస్తే సామ చెప్పినట్లుగా కేసీఆర్ ఫ్యామిలీలో ఏదో నడుస్తోందనే అనుమానం మరింత బలపడుతోంది.


Also Read:

ఆ భావన ఇస్లాంలోనే కాదు.. హిందూమతంలోనూ ఉంది

పెద్దిరెడ్డికి హైకోర్టులో దక్కని ఊరట..

For More Telangana News and Telugu News..

Updated Date - May 22 , 2025 | 07:27 PM