ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

MLA: అభివృద్ధి పనుల్లో రాజకీయాలు వద్దు..

ABN, Publish Date - Jun 13 , 2025 | 09:34 AM

ప్రజల అవసరాలు తీర్చే విధంగా అభివృద్ధి పనులు కొనసాగాలని అందులో రాజకీయాలు వద్దని ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ ప్రకారం రోడ్లు వేయాలని జీహెచ్‌ఎంసీ అధికారులకు ఆయన సూచించారు.

- చెత్త రాజకీయాలు చేస్తున్నారు.. కార్పొరేటర్‌ సుప్రియా నవీన్‌గౌడ్‌

హైదరాబాద్: ప్రజల అవసరాలు తీర్చే విధంగా అభివృద్ధి పనులు కొనసాగాలని అందులో రాజకీయాలు వద్దని ఎమ్మెల్యే ముఠా గోపాల్‌(MLA Mutha Gopal) ఘాటుగా స్పందించారు. నిబంధనల ప్రకారం రోడ్లు వేయాలని జీహెచ్‌ఎంసీ(GHMC) అధికారులకు ఆయన సూచించారు. గురువారం ముషీరాబాద్‌ డివిజన్‌లోని భరత్‌నగర్‌లో రూ.18లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను కార్పొరేటర్‌ సుప్రియానవీన్‌గౌడ్‌, జీహెచ్‌ఎంసీ డీఈ గీతాకుమారి, ఏఈమురళితో కలిసి ఎమ్మెల్యే రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కొంతమంది రాజకీయ దురుద్దేశంతో నిర్మాణ పనులకు అడ్డు తగులుతున్నారని ఆరోపించారు. వర్షాలు కురుస్తున్నాయి. పనుల్లో జాప్యం జరగకుండా వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. కార్పొరేటర్‌ సుప్రియా నవీన్‌గౌడ్‌(Corporator Supriya Naveen Goud) మాట్లాడుతూ... డివిజన్‌లో అభివృద్ధి పనులకోసం పోరాడుతుంటే ఇతర పార్టీల నేతలు చెత్తరాజకీయాలు చేస్తూ అభివృద్ధిని అడ్డుకునేందుకు యత్నిస్తున్నారు అని విమర్శించారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆదేశాలు, జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌లో ముషీరాబాద్‌ సమస్యను ప్రస్తావించడం వల్లే నిధులు విడుదల అయ్యాయని తెలిపారు.

ఇప్పటివరకు ముషీరాబాద్‌ డివిజన్‌లో అధ్వానంగా ఉన్న 35 రోడ్లను ఆధునికీకరించామని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ ముషీరాబాద్‌ డివిజన్‌ అధ్యక్ష, కార్యదర్శులు శ్రీధర్‌రెడ్డి, ఆకుల అరుణ్‌, పార్టీ సీనియర్‌ నాయకులు శివముదిరాజ్‌, దీన్‌దయాల్‌రెడ్డి, పి.శ్రీధర్‌చారి, డివిజన్‌ ఉపాధ్యక్షులు బల్ల ప్రశాంత్‌, క్రాంతి, జి.రాజు, విద్యార్థి విభాగం అధ్యక్షుడు కార్తిక్‌యాదవ్‌, బీజేపీ ముషీరాబాద్‌ నియోజకవర్గం జాయింట్‌ కన్వీనర్‌ ఎం.నవీన్‌ గౌడ్‌, ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకుడు జమాల్‌పురి నందు, బీజేవైఎం నగర నాయకులు అనిల్‌కుమార్‌, కుషాల్‌గౌడ్‌, ఆయూష్‌ పాల్గొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి.

9 నెలల్లోనే జనాభా లెక్కలు రెడీ

రోడ్డు నిర్మించకుండానే బిల్లుల మంజూరు

Read Latest Telangana News and National News

Updated Date - Jun 13 , 2025 | 09:34 AM