ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Celebrity Chefs: అందాల భామలు.. బిర్యానీ, పలావ్‌లు!

ABN, Publish Date - May 10 , 2025 | 03:48 AM

మిస్‌ వరల్డ్‌ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన వివిధ దేశాల అందాల భామలు బిర్యానీ, పలావ్‌లను ఇష్టంగా తింటున్నారు. వీటితోపాటు ఘాటైన వంటకాలకూ జైకొడుతున్నారు.

  • వారు ఘాటైన వంటకాలను ఇష్టపడుతున్నారు

  • పులుసు, వేపుడు అడిగి మరీ తింటున్నారు

  • ‘మిస్‌ వరల్డ్‌’ చెఫ్‌లతో ‘ఆంధ్రజ్యోతి’ ముచ్చట

హైదరాబాద్‌, మే 9 (ఆంధ్రజ్యోతి): మిస్‌ వరల్డ్‌ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన వివిధ దేశాల అందాల భామలు బిర్యానీ, పలావ్‌లను ఇష్టంగా తింటున్నారు. వీటితోపాటు ఘాటైన వంటకాలకూ జైకొడుతున్నారు. కొన్ని రకాల వేపుడు (ఫ్రై), పులుసును అడిగి మరీ తింటున్నారు. మిస్‌ వరల్డ్‌ పోటీలో ఉన్న 109 దేశాల సుందరీమణులకు వంట చేసిపెడుతున్న ప్రముఖ చెఫ్‌లు ప్రియాంక, ఉదయ్‌ ఈ విశేషాలు వెల్లడించారు. మిస్‌ వరల్డ్‌ పోటీదారులకు హైదరాబాద్‌ హైటెక్‌సిటీలోని ఓ స్టార్‌ హోటల్‌లో బస ఏర్పాటు చేశారు. ఆ హోటల్‌లో ఈ క్రమంలోనే ఆ హోటల్‌ వంటవాళ్ల (చెఫ్‌ల)తో ‘ఆంధ్రజ్యోతి’ ముచ్చటించింది. అందాల భామలకు వారి దేశాల వంటలతోపాటు తెలంగాణ ప్రత్యేక వంటలనూ రుచి చూపిస్తున్నామని ప్రియాంక, ఉదయ్‌ తెలిపారు. ‘‘అందాల పోటీల కోసం వివిధ దేశాల నుంచి వచ్చిన వారందరికీ మంచి ఆహారం సిద్ధం చేస్తున్నాం. ప్రతిరోజూ కొన్ని ప్రత్యేక వంటలు అందిస్తూ, అందులో తెలంగాణ రుచులు ఉండేలా చూస్తున్నాం. వారు పులుసు, వేపుళ్లు ఇష్టపడుతున్నారు.


బిర్యానీని అడిగి మరీ తింటున్నారు. రోజూ ఎన్ని వంటలు మారినా.. హైదరాబాద్‌ బిర్యానీ మాత్రం కచ్చితంగా ఉంటోంది. మటన్‌ కర్రీ, పుట్టగొడుగులు, బంగాళదుంపల వేపుడు కూడా చేసి పెడుతున్నాం. ఏయే దేశాల వారికి ఆ దేశ వంటలను కూడా అందుబాటులో ఉంచుతున్నాం. మొత్తంగా 60శాతం బయటి దేశాల ఆహారమైతే, 40 శాతం భారతీయ వంటకాలు ఉంటున్నాయి. ఉత్తరప్రదేశ్‌కు చెందిన చంపారన్‌ రామ్‌పూరి థార్‌ కుర్మా, బిహరీ వంటకం అహునామీట్‌తోపాటు రాజస్థాన్‌, ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రముఖ వంటలను సిద్ధం చేస్తున్నాం. రుచికరమైన, నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నాం. ‘అతిథి దేవో భవ’ అన్న సూక్తిని అమలు చేస్తున్నాం..’’ అని తెలిపారు. ఇక మిస్‌ వరల్డ్‌ పోటీదారులకు భోజనాల తయారీ కోసం తమ దగ్గర 100 మంది చెఫ్‌లు, 500 మంది సహాయకులు ఉన్నారని హోటల్‌ జనరల్‌ మేనేజర్‌ కుమ్రా చెప్పారు. పోటీలకు వచ్చేవారి వివరాలు తెలుసుకుని, 45 రోజుల ముందునుంచే ప్రత్యేక వంటల కోసం ఏర్పాట్లు చేసుకున్నామని తెలిపారు. కొన్ని రకాల ప్రత్యేక వంటల కోసం ఐదుగురు అంతర్జాతీయ చెఫ్‌లు కూడా వచ్చారని పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి

Operation Sindoor: సోషల్ మీడియాలో పాక్ తప్పుడు ప్రచారం.. వాస్తవాలు బయటపెట్టిన PIB

PIB Fact Check: 3 రోజుల పాటు ATMలు బంద్.. వైరల్ పోస్టుపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్..

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 10 , 2025 | 03:48 AM