Seethakka: అధికారం పోయాక ఆత్మగౌరవం గుర్తొచ్చిందా?
ABN, Publish Date - May 16 , 2025 | 03:36 AM
అధికారం పోయాక బీఆర్‌ఎస్ నాయకులకు ఆత్మగౌరవం గుర్తుకు వచ్చిందా? అని మంత్రి ధనసరి సీతక్క గురువారం ఓ ప్రకటనలో మండిపడ్డారు.
కలెక్టర్‌తో కాళ్లు మొక్కించుకున్న దురహంకారం మీదే: మంత్రి సీతక్క
ములుగు, మే 15 (ఆంధ్రజ్యోతి): అధికారం పోయాక బీఆర్‌ఎస్ నాయకులకు ఆత్మగౌరవం గుర్తుకు వచ్చిందా? అని మంత్రి ధనసరి సీతక్క గురువారం ఓ ప్రకటనలో మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ సుందరి పోటీల్లో భాగంగా బుధవారం జరిగిన హెరిటేజ్ వాక్ సక్సెస్ కావడంతో బీఆర్‌ఎస్ నాయకులు కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి ఇవాంక ట్రంప్ వచ్చినప్పుడు తోకపట్టుకుని తిరిగిన నాయకులు ఎలాంటి సంప్రదాయాలను పాటించారో అందరికి తెలుసని పేర్కొన్నారు. గుడిలోకి వెళ్లే ముందు కాళ్లు కడుక్కొని వెళ్లడం మన సంప్రదాయమని, అందులో భాగంగానే ఈవెంట్ మేనేజ్‌మెంట్ అమ్మాయిల కాళ్లకు నీళ్లు పోసిందని, అది పట్టుకుని తెలంగాణ ప్రభుత్వాన్ని బద్నాం చేస్తారా? అని ప్రశ్నించారు. కవిత కాళ్ల దగ్గర కలెక్టర్‌ను కూర్చోపెట్టుకోవడం, కేసీఆర్ కలెక్టర్‌తో కాళ్లు మొక్కించుకోవడం మీ దురహంకారానికి నిదర్శనం కాదా? అని మండిపడ్డారు. ఈ మధ్య సబితా ఇంద్రారెడ్డి ములుగు జిల్లా మీద పచ్చి అబద్ధాలు చెబుతున్నారని, ఆమె మంత్రిగా ఉన్నప్పుడు ఏం మానవత్వం చూపిందో తెలుసని అన్నారు. అబద్ధాలకు అంబాసిడర్‌గా మారొద్దని సబితకు హితవు పలికారు. కోడిగుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నాలు మానుకోవాలని బీఆర్‌ఎస్‌కు మంత్రి సూచించారు.
కేసీఆర్ కాళ్లు ఐఏఎస్ కడిగినప్పుడేమైంది మీ పరువు
‘కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఒక ఐఏఎస్ ఆయన కాళ్లు కడిగినప్పుడు, కవిత కాళ్ల దగ్గర కలెక్టర్ కూర్చున్నప్పుడు మీ పరువేమైంది’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఎమ్మెల్యే మధుసూధన్‌రెడ్డి ప్రశ్నించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అధికారులతో కాళ్లు మొక్కించుకున్న నీచ చరిత్ర కేసీఆర్‌దని చెప్పారు. వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డితో కలిసి ఆయన గురువారం అసెంబ్లీ హాల్‌లో మీడియాతో మాట్లాడుతూ మిస్ వరల్డ్ పోటీలతో తెలంగాణ ఖ్యాతి విరాజిల్లనుందని అన్నారు. అందుకే కేటీఆర్, హరీశ్ అక్కసు వెళ్లగక్కుతున్నారని, మహిళలను అవమానించేలా మాట్లాడుతున్నారని మండి పడ్డారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Rahul Gandhi: రాహుల్‌పై చర్యలకు రంగం సిద్ధం..
Abhinandan Vardhaman: అభినందన్ వర్థమాన్‌ను భారత్‌కి పాక్ ఆర్మీ అప్పగించిన తర్వాత ఏమైందంటే..
Supreme Court: సుప్రీంకోర్టులో సజ్జల భార్గవ్‌కు చుక్కెదురు
For Telangana News And Telugu News
Updated Date - May 16 , 2025 | 03:36 AM