ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Mahesh Kumar Goud: బీసీలకు అత్యధిక రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌‌దే

ABN, Publish Date - Jul 13 , 2025 | 03:59 AM

దేశ చరిత్రలోనే బీసీలకు అత్యధికంగా రిజర్వేషన్లు కల్పించిన ఘనత కాంగ్రె్‌సదేనని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ అన్నారు.

  • బీఆర్‌ఎస్‌ స్పందించకపోవడం దౌర్భగ్యం

  • దయ్యాల పీడ వదిలిందా? లేదా? కవిత చెప్పట్లేదు?

  • బీసీలపై బీజేపీ చిత్తశుద్ధి తేలిపోయింది

  • టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ గౌడ్‌

హైదరాబాద్‌, జూలై 12 (ఆంధ్రజ్యోతి): దేశ చరిత్రలోనే బీసీలకు అత్యధికంగా రిజర్వేషన్లు కల్పించిన ఘనత కాంగ్రె్‌సదేనని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కాంగ్రెస్‌ మార్క్‌గా చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చే ఆర్డినెన్సు చరిత్రాత్మకమని.. ఈ సందర్భంలో తాను టీపీసీసీ అధ్యక్షుడిగా ఉండటం జీవితంలో చేసుకున్న అదృష్టమని వ్యాఖ్యానించారు. రిజర్వేషన్ల పెంపుపై బీసీ సమాజమంతా హర్షిస్తూ సంబరాలు చేసుకుంటే బీఆర్‌ఎస్‌ నేతలు కనీసం స్పందించకపోవడం దౌర్భాగ్యమని విమర్శించారు. అధికారంలో కొనసాగినప్పుడు కేంద్రంలోని బీజేపీకి అన్ని బిల్లుల సమయంలో మద్దతు పలికిన బీఆర్‌ఎస్‌.. బీసీ రిజర్వేషన్లపై కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయకపోవడం చూస్తుంటే ఆ పార్టీకి బీసీల పట్ల ఉన్న చిత్తశుద్ధిని స్పష్టం చేస్తోందన్నారు.

కవిత ఏ పార్టీలో ఉన్నారో..?

అసలు కవిత ఏ పార్టీలో ఉన్నారో అర్థం కావట్లేదని మహేశ్‌ గౌడ్‌ అన్నారు. బీసీ రిజర్వేషన్లపై ఆమె సంబరాలు చేసుకోవడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. ‘బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్‌ కార్యాచరణ మొదలుపెట్టినప్పుడు కవిత లిక్కర్‌ స్కాంలో ఊచలు లెక్కపెడుతున్నారు. బీఆర్‌ఎ్‌సలో దయ్యాలు ఉన్నాయన్న ఆమె.. నేడు ఆ దయ్యాల పీడ వదిలిందా? లేదా.. ఎందుకు చెప్పడం లేదు.’ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ చాంపియన్‌ రాహుల్‌ గాంధీ, సీఎం రేవంత్‌లు బీసీల అభ్యున్నతి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్టు తెలిపారు. ఎవరు దొంగలు.. ఎవరు హీరోలన్నది తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారన్నారు. బీసీ రిజర్వేషన్లు కాంగ్రె్‌సతోనే సాధ్యమని చెప్పారు. బీసీల పట్ల బీజేపీ చిత్తశుద్ధి ఏపాటిదో తేలిపోయిందని.. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి చివరికి ఎవరికి కట్టబెట్టారో అందరికీ తెలుసన్నారు.

ఇవి కూడా చదవండి..

విమాన ప్రమాదం.. నివేదికలో బయటపడ్డ సంచలన విషయాలు

కుర్చీ దొరికితే వదలొద్దు.. డీకే ఆసక్తికర వ్యాఖ్యలు

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 13 , 2025 | 03:59 AM