ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

KTR: ‘జై తెలంగాణ’ అననోణ్ని ఏమనాలె?

ABN, Publish Date - Jun 17 , 2025 | 04:02 AM

రాష్ట్రంలో కక్షపూరిత రాజకీయాలు కొనసాగుతున్నాయని బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఆరోపించారు. పాలన చేతగాని రేవంత్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ నేతలపై అక్రమ కేసులు పెట్టి, వేధించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

  • హౌలా అన్నందుకు నాపై మండిపడుతున్నరు

  • రేవంత్‌లాగా లుచ్చాపని మా పార్టీలో ఎవరూ చేయలే

  • నాపై పెట్టింది లొట్టపీసు కేసు.. ఆయనో లొట్టపీసు సీఎం

  • నన్ను జైల్లో పెడితే పెట్టుకోండి.. విశ్రాంతి తీసుకుంటా: కేటీఆర్‌

  • అర్వింద్‌ కుమార్‌ అదృశ్యం!.. భువనగిరి ఎంపీ చామల సందేహం

హైదరాబాద్‌, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కక్షపూరిత రాజకీయాలు కొనసాగుతున్నాయని బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఆరోపించారు. పాలన చేతగాని రేవంత్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ నేతలపై అక్రమ కేసులు పెట్టి, వేధించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ‘‘మొన్న ఆయన్ను హౌలా అన్నందుకు మండిపడుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి కూడా జై తెలంగాణ అననోడ్ని ఏమనాలె?’’ అని కేటీఆర్‌ ప్రశ్నించారు. ‘రాష్ట్రం దివాలా తీసిందంటడు. ఢిల్లీలో దొంగలా చూస్తున్నారంటడు. అప్పు పుట్టడం లేదంటడు. ఇలాంటోడ్ని ఏమనాల్నో మీరే చెప్పండి’ అని బీఆర్‌ఎస్‌ కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు. ఏసీబీ విచారణకు హాజరైన అనంతరం సోమవారం సాయంత్రం కేటీఆర్‌ పార్టీ శ్రేణులతో కలిసి ర్యాలీగా తెలంగాణభవన్‌కు చేరుకున్నారు. అక్కడ పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణ ప్రతిష్ఠను ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లే పనిచేశానని, తలదించుకునేలా తాను ఎలాంటి తప్పూ చేయలేదని కేటీఆర్‌ చెప్పారు. లుచ్చా పనిచేసి నెలరోజులు జైల్లో ఉన్న రేవంత్‌కు ప్రతిపక్ష నేతలను కూడా కొన్నిరోజులు జైల్లో పెట్టాలని ఒక షోకు ఉందని.. అందుకే తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్‌ను, మాజీ మంత్రి హరీశ్‌ను కాళేశ్వరం కమిషన్‌ విచారణకు రప్పించారని ఆరోపించారు.

ఆయనలాగా లుచ్చా పనిచేసి రూ.50 లక్షలతో పట్టుబడిన వారు తమ పార్టీలో ఎవరూ లేరన్నారు. ‘నాకు దక్కనిది ఎవరికీ దక్కొద్దు.. నాకు జరిగింది నీకూ జరగాలి’ అన్నట్లుగా సీఎం శాడిస్టులా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ‘జైల్లో పెడితే పెట్టనీ. 15 రోజులు జెలుకెళ్తే ఏమైతది. కొన్ని రోజులు రెస్ట్‌ తీసుకుంట. ఈ ఉడత ఊపులకు భయపడేది లేదు’ అని కేటీఆర్‌ అన్నారు. నాలుగు గోడల మధ్య కాదు నాలుగు కోట్ల మంది ముందు ఫార్ములా-ఈ రేసు గురించి అసెంబ్లీలో చర్చిద్దామంటే రేవంత్‌రెడ్డి పారిపోయారని చెప్పారు. దేశంలో ఏ రాజకీయ నాయకుడు సాహసించని లై డిటెక్టర్‌ పరీక్షకు సిద్ధమని తానంటే.. రావడానికి ఈ సీఎంకు ధైర్యం లేదని ఎద్దేవా చేశారు. మొదటి సంవత్సరం ఫార్ములా-ఈ రేసు విజయవంతం కావడంతో రెండో ఏడాది కూడా హైదరాబాద్‌లోనే నిర్వహించాలని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుందన్నారు. అందులో భాగంగానే నిర్వహణ సంస్థకు డబ్బులు పంపిన విషయాన్ని ఏసీబీ అధికారులకు వివరించానని కేటీఆర్‌ తెలిపారు. ఇందులో అవినీతి ఎక్కడ ఉందని తాను అధికారులను ప్రశ్నిస్తే, సమాధానం చెప్పలేకపోయారన్నారు. చిట్టినాయుడు రాసిచ్చిన పనికిమాలిన ప్రశ్నలనే ఏసీబీ అధికారులు పొద్దుట్నుంచీ అటుతిప్పి, ఇటుతిప్పి అడిగారని చెప్పారు. ఒకవేళ ప్రభుత్వ పెద్దల నుంచి అరెస్ట్‌ చేయాలని ఒత్తిడి ఉంటే చేసుకోమని అధికారులకు చెప్పానన్నారు. రేవంత్‌రెడ్డి ఒక లొట్టపీసు ముఖ్యమంత్రి అని, వాళ్లు తనపై పెడుతున్న కేసులన్నీ లొట్టపీసు కేసులేనని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా దద్దమ్మ రాజకీయాలతో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. దీనిపై పార్టీ శ్రేణులు ఆందోళన చెందాల్సిన పనిలేదని, ధైర్యంగా ఎదుర్కొందామని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని ఫుట్‌బాల్‌ ఆడుకుందామని, ఆ పార్టీ అభ్యర్థులను చిత్తుగా ఓడించి సత్తా చాటుకుందామని పిలుపునిచ్చారు. ఈ నెల 21కి తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టును జాతికి అంకితం చేసి ఆరేళ్లవుతోందని, ఈ సందర్భంగా కాళేశ్వరం గొప్పదనాన్ని ప్రజలకు తెలియజేద్దామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ తరఫున కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.

ప్రశ్నిస్తున్నందుకే కక్ష సాధింపు: హరీశ్‌

రేవంత్‌రెడ్డి అసమర్థతను, పాలనా వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకే కేటీఆర్‌పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని హరీశ్‌ ఆరోపించారు. ప్రజలకిచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేర్చని రేవంత్‌రెడ్డి.. 18 నెలల పాలనలో కేటీఆర్‌పై 14కేసులు పెట్టారని విమర్శించారు. దేశంలోని చాలా రాష్ట్రాలు పోటీ పడినా కేటీఆర్‌ తన శక్తియుక్తులను ఉపయోగించి హైదరాబాద్‌కు ఫార్ములా-ఈ రేసును తెచ్చారన్నారు. దేశంలో ఏ రాష్ట్రమూ అందాల పోటీలను నిర్వహించబోమని తేల్చిచెబితే రేవంత్‌రెడ్డి మాత్రం తెలంగాణలో నిర్వహించి రాష్ట్రం పరువు తీశారని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలోనే కేటీఆర్‌పై తప్పుడు కేసులు పెట్టి, చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎన్ని కేసులు పెట్టినా కేటీఆర్‌ భయపడే వ్యక్తి కాదని తెలిపారు. లక్షలాది మంది బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, కుటుంబ సభ్యుల అండ ఉన్న కేటీఆర్‌ను ముట్టుకుంటే భస్మం అయిపోతారని కాంగ్రె్‌సను హెచ్చరించారు.

ఈ వార్తలు కూడా చదవండి

గోడలు దూకేందుకు బీజేపీ నేతల యత్నం.. జీహెచ్‌ఎంసీ వద్ద టెన్షన్ టెన్షన్

కొండపల్లి మున్సిపాలిటీ టీడీపీ కైవసం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 17 , 2025 | 04:02 AM