ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Kishan Reddy: మజ్లిస్‌ చేతిలో కీలు బొమ్మలు

ABN, Publish Date - Apr 22 , 2025 | 04:37 AM

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు మజ్లిస్‌ చేతిలో కీలు బొమ్మలని, ఆ రెండు పార్టీలకు సూపర్‌ బాస్‌ మజ్లిస్‌ అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ అని కేంద్ర మంత్రి.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విమర్శించారు.

  • కాంగ్రెస్‌, బీఆర్‌ఎ్‌సకు సూపర్‌ బాస్‌ అసద్‌

  • మజ్లిస్‌కు బీఆర్‌ఎస్‌ మద్దతు సిగ్గుచేటు

  • మతోన్మాద పార్టీతో రాహుల్‌ దోస్తీ: కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌/సంగారెడ్డి అర్బన్‌/సుభాష్ నగర్‌ (నిజామాబాద్‌), ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు మజ్లిస్‌ చేతిలో కీలు బొమ్మలని, ఆ రెండు పార్టీలకు సూపర్‌ బాస్‌ మజ్లిస్‌ అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ అని కేంద్ర మంత్రి.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విమర్శించారు. స్వార్థ ప్రయోజనాల కోసం కాంగ్రెస్‌, బీఆర్‌ఎ్‌సలు మజ్లిస్‌ మోచేతి నీళ్లు తాగుతున్నాయని ధ్వజమెత్తారు. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన మజ్లి్‌సకు హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో బీఆర్‌ఎస్‌ మద్దతివ్వడం సిగ్గుచేటని మండిపడ్డారు. బుధవారం ఎమ్మెల్సీ ఎన్నిక జరగనున్న నేపథ్యంలో సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్‌రెడ్డి.. పార్టీ కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పచ్చి మతోన్మాద మజ్లి్‌సతో స్నేహం చేస్తున్న రాహుల్‌గాంధీ ఏ మొహం పెట్టుకుని సెక్యులర్‌ అంటున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎ్‌సలు ఇప్పటికే మజ్లి్‌సకు హైదరాబాద్‌ను అప్పగించాయని.. భవిష్యత్తులో తెలంగాణను సైతం అప్పగించడానికి వెనకాడబోవన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలో మజ్లి్‌సను గెలిపించాలని అంతర్గతంగా నిర్ణయించుకున్న బీఆర్‌ఎస్‌.. ఆ విషయాన్ని బహిరంగంగా ఎందుకు చెప్పడం లేదని నిలదీశారు. ఓట్లు ఉన్నా ఎందుకు పోటీ చేయడం లేదని.. ఓటింగ్‌కు వెళ్లొద్దని కార్పొరేటర్లను ఎందుకు బెదిరిస్తున్నారని బీఆర్‌ఎ్‌సను ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికలో తాము విజయం సాధిస్తామని.. తమ అభ్యర్థి గౌతంరావు ఇతర పార్టీల ఓటర్లను ప్రజాస్వామ్య మార్గంలో కలిసి, మద్దతు కోరారని తెలిపారు.


కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పోటీ చేయకపోవడం సిగ్గుచేటు: లక్ష్మణ్‌

హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పోటీ చేయకపోవడం సిగ్గుచేటని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ అన్నారు. ఆ రెండు పార్టీలు మజ్లి్‌సకు అంతర్గతంగా మద్దతు ఇవ్వడమంటే పాముకు పాలుపోసి పెంచినట్లేనని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ఓటు వేయవద్దని పిలుపునివ్వడం హాస్యాస్పదమన్నారు. ఐదు దశాబ్దాలుగా ఒవైసీ కుటుంబం పాత నగరంలో అధికారంలో ఉన్నా.. ప్రజల జీవన ప్రమాణాలు మాత్రం మెరుగుపడలేదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్‌.వి.ఎ్‌స.ఎస్‌. ప్రభాకర్‌ ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికలో ఎంఐఎం కార్పొరేటర్లు అసదుద్దీన్‌ కుటుంబానికి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.


వక్ఫ్‌ ఆస్తులను వెల్లడించే దమ్ముందా?: రఘునందన్‌రావు

సీఎం రేవంత్‌రెడ్డికి పాతబస్తీలో వక్ఫ్‌ ఆస్తులపై శ్వేత పత్రం విడుదల చేసే దమ్ముందా..? అని ఎంపీ రఘునందన్‌రావు ప్రశ్నించారు. సంగారెడ్డి శివారులోని బీజేపీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో కొత్తగా తీసుకొచ్చిన రెవెన్యూ చట్టంలో వక్ఫ్‌ ఆస్తులెన్ని ఉన్నాయో బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు. వక్ఫ్‌ బోర్డు దేశానికే ప్రమాదకరంగా మారిందని నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ విమర్శించారు. సోమవారం నిజామాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వక్ఫ్‌ బోర్డు పేద ముస్లింల కోసం పని చేయడం లేదన్నారు. వక్ఫ్‌ ఆస్తులను ఒవైసీ ఒక్కడే కాకుండా కాంగ్రె్‌సలో ఉన్న పెద్ద ముస్లింలు కూడా మింగుతున్నారని ఆరోపించారు. వక్ఫ్‌ ఆదాయం పెంచే విధంగా కొత్త చట్టాన్ని తీసుకువస్తున్నామని తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి...

CM Revanth Reddy: ఆ అధికారిని రిటైరయ్యాక కొనసాగించండి

BRS MLC Kavitha: పేరుకే ముగ్గురు మంత్రులు అభివృద్ధి శూన్యం

Cybercrime: సైబర్‌ నేరగాళ్లకు కమీషన్‌పై ఖాతాల అందజేత

Indigo Flight Delay: ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 22 , 2025 | 04:37 AM