Cybercrime: సైబర్ నేరగాళ్లకు కమీషన్‌పై ఖాతాల అందజేత
ABN , Publish Date - Apr 21 , 2025 | 04:25 AM
సైబర్ నేరగాళ్లకు కమీషన్ పద్ధతిలో బ్యాంకు ఖాతాలు సమకూర్చుతూ సహకరిస్తున్న ముంబై యువకుడిని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. నవీ ముంబైలో ఉంటున్న రష్మిత్ రాజేంద్ర పాటిల్ (22) ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు.

ముంబై యువకుడిని అరెస్ట్ చేసిన సైబర్ క్రైం పోలీసులు
హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): సైబర్ నేరగాళ్లకు కమీషన్ పద్ధతిలో బ్యాంకు ఖాతాలు సమకూర్చుతూ సహకరిస్తున్న ముంబై యువకుడిని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. నవీ ముంబైలో ఉంటున్న రష్మిత్ రాజేంద్ర పాటిల్ (22) ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. సులభంగా డబ్బులు సంపాదించేందుకు సైబర్ నేరగాళ్లతో చేతులు కలిపి వారికి బ్యాంకు ఖాతాలు సమకూర్చడం మొదలుపెట్టాడు. సైబర్ నేరగాళ్లు తాము మోసం చేసి కాజేసిన సొమ్మును రష్మిత్ ఇచ్చిన ఖాతాలకు బదిలీ చేసేవారు. వాటిలోకి వచ్చిన డబ్బులో కొంత కమీషన్ తీసుకొని మిగతా డబ్బును వారు చెప్పిన ఖాతాలకు బదిలీ చేస్తున్నాడు. ఇదిలాఉండగా..
హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారి (56)ని షేర్ మార్కెట్లో పెట్టుబడి పేరుతో మోసం చేసిన సైబర్ నేరగాళ్లు ఆయన నుంచి రూ.2.43 కోట్లు వసూలు చేశారు. ఈ డబ్బును రష్మిత్ అందించిన బ్యాంకు ఖాతాల్లో జమ చేయించారు. బాధితుడు సైబర్ క్రైం ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రష్మిత్ సమకూర్చిన బ్యాంకు ఖాతాల్లో బాధితుడి డబ్బు డిపాజిట్ అయినట్లు గుర్తించారు. సైబర్ క్రైం డీసీపీ కవిత దార ఆదేశాల మేరకు సైబర్ క్రైం ఇన్‌స్పెక్టర్ పి. ప్రమోద్, ఎస్సై షేక్ అజీజ్‌ల బృందం ముంబై వెళ్లి నిందితుడు రష్మిత్‌ను అరెస్ట్ చేసి నగరానికి తరలించారు.
Also Read:
క్రికెట్ ఆడుతోండగా పిడుగు పడి.. యువకులు మృతి
థాకరే, రాజ్ మధ్య సయోధ్యపై బీజేపీ ఆసక్తికర వ్యాఖ్యలు
గుజరాత్‌లో పటేల్ విగ్రహాన్ని పరిశీలించిన మంత్రి
For More Telangana News and Telugu News..