Lightning Strike: క్రికెట్ ఆడుతోండగా పిడుగు పడి.. యువకులు మృతి
ABN , Publish Date - Apr 20 , 2025 | 07:50 PM
Lightning Strike: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. క్రికెట్ ఆడుతోన్న యువకులకు పిడుగు పడింది. ఈ ఘటనలో ఇద్దరు యవకులు అక్కడికక్కడే మరణించారు. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.
ఒంగోలు, ఏప్రిల్ 20: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బేస్తవారిపేట మండలం పెద్ద ఓబినేనిపల్లి గ్రామంలో పిడుగు పడి ఇద్దరు యువకులు మృతి చెందారు.గ్రామానికి చెందిన ఆకాష్(17), తన్ని(18) క్రికెట్ ఆడుతోండగా పిడుగు పడింది. దీంతో వీరిద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో యువకుడికి తీవ్ర గాయాలు.. చికిత్స కోసం కంభంలోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు.అయితే మృతి చెందిన యువకుల కుటుంబాల్లో విషాదం నెలకొంది.
మరోవైపు వేసవి కాలం కావడంతో ఎండలు మండిపోతున్నాయి. దీంతో వాతావరణంలో సైతం తేమ శాతం కనిష్టానికి చేరుకుంది. దీంతో ఓ విధమైన ఉక్కపోతకు జనం గురవుతున్నారు. అలాంటి వేళ.. వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. దాంతో ఉన్నట్టు ఉండి ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ఈ తరహా వాతావరణం తెలుగు రాష్ట్రాల్లో సర్వ సాధారణమైపోయింది. ఇంకోవైపు.. ఉరుములు, మెరుపులతోపాటు భారీ వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ కేంద్రం పలుమార్లు సూచించిన సంగతి తెలిసింది. అలాగే పిడుగులు పడే అవకాశముందని.. అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజలకు సూచిస్తున్న విషయం విధితమే.
ఇది కూడా చదవండి..
Minister Narayana: గుజరాత్‌లో పటేల్ విగ్రహాన్ని పరిశీలించిన మంత్రి నారాయణ బృందం
YSRCP: అధికారం కోల్పోయినా.. అరాచకాలు ఆగలేదు
10th class Students: సార్, ఛాయ్ తాగండి, నన్ను పాస్ చేయండి
CM Chandrababu: టీ 20 మ్యాచెస్ ఎంత ఇంట్రెస్ట్‌గా ఉంటాయో.. అసెంబ్లీ సమావేశాలు..
CM Chandrababu Birthday: సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకల్లో అపశృతి
For Andhrapradesh News And Telugu News