Share News

CM Chandrababu: టీ 20 మ్యాచెస్ ఎంత ఇంట్రెస్ట్‌గా ఉంటాయో.. అసెంబ్లీ సమావేశాలు..

ABN , Publish Date - Apr 20 , 2025 | 04:48 PM

CM Chandrababu: 1995లో ముఖ్యమంత్రిగా ఫైళ్ళ క్లియరెన్స్, క్లీన్ అండ్ గ్రీన్ వంటి అనేక కాన్సెప్ట్‌లను సీఎం చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారని టీడీ జనార్దన్ తెలిపారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన ప్రసంగాలన్నీ ఒక పుస్తకంలో.. ప్రతిపక్ష నేతగా ఉండి బాబ్లీలో పోరాటం చేసి మహారాష్ట్రలో జైలు కూడా వెళ్లారని గుర్తు చేశారు.

CM Chandrababu: టీ 20 మ్యాచెస్ ఎంత ఇంట్రెస్ట్‌గా ఉంటాయో.. అసెంబ్లీ సమావేశాలు..

అమరావతి, ఏప్రిల్ 20: ప్రస్తుతం టీ 20 మ్యాచెస్ ఎంత ఇంట్రెస్ట్‌గా చూస్తున్నారో అప్పట్లో ప్రెస్ గ్యాలరీ నుంచి ఉమ్మడి ఏపీ అసెంబ్లీ సమావేశాలు కూడా అలాగే చూసే వాడినని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ ప్రసంగాల పుస్తకాల రచయిత విక్రమ్ పూల వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉదయం 7:30కు వాయిదా తీర్మానం ఇచ్చే సమయం నుంచి తిరిగి సభ వాయిదా పడే వరకు తాను ప్రత్యక్ష సాక్షిగా ఆయన ప్రసంగాలను చూశానని విక్రమ్ పూల గుర్తు చేసుకొన్నారు.


ఆదివారం అమరావతిలో చంద్రబాబు నాయుడు అసెంబ్లీ ప్రసంగాల పుస్తక ఆవిష్కరణ సభలో రచయిత విక్రమ్ పూల మాట్లాడుతూ.. స్వర్ణాంధ్రప్రదేశ్ సారథి నారా చంద్రబాబు నాయుడు పేరుతో రెండు పుస్తకాలు ముందుకు తెచ్చామన్నారు. అందులో ఆయన మొత్తం ప్రసంగాలు కాకుండా ముఖ్యమైన వాటిని మాత్రమే ఎంపిక చేసి పుస్తకంగా తీసుకు వచ్చామని వివరించారు.


1987 నుంచి సీఎం చంద్రబాబు నాయుడు టీడీపీ జనరల్ సెక్రటరీగా ఉన్నప్పటి నుంచి ఆయనతో తనకు పరిచయం ఉందని పేర్కొన్నారు. అనంతరం తెలుగుదేశం పార్టీ పక్ష పత్రికకు సైతం తాను ఎడిటర్‌గా పని చేశానని చెప్పారు. కేంద్ర మాజీ మంత్రులు ఎర్రంనాయుడు, అశోక్ గజపతిరాజు, కేసీఆర్‌లతోపాటు టీడీ జనార్ధన్‌లతో కలిసి పార్టీ లిటరేచర్‌కు కృషి చేశామని వివరించారు. సీఎం చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా ఇంత మంది ప్రముఖుల మధ్య ఈ పుస్తకాల ఆవిష్కరణ కావడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానన్నారు.


విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) బయోగ్రఫీని ఎస్ వెంకట్ నారాయణ తొలిసారి రచించారన్నారు. ఆయన ఇంటర్నేషనల్ జర్నలిస్టు అని.. ఆయన సైతం ఈ సభకు రావడం ఎంతో సముచితంగా ఉందని పేర్కొన్నారు.


ఈ పుస్తక రూపకర్త టీడీ జనార్దన్ మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు వ్యవసాయం దండగ అన్నారని గాలి ప్రచారం చేశారని టీడీ జనార్దన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలపై ఆధారం చూపాలని అడిగితే నేటికీ తేలేక పోయారన్నారు. అందుకే నిజాలు మనం మాట్లాడకపోతే అబద్ధాలు రాజ్యమేలుతాయని పేర్కొన్నారు. ప్రచార యుద్ధం ముందు గెలిస్తేనే అసలు యుద్ధం గెలుస్తామని ఆయన స్పష్టం చేశారు.


ఐటీ విప్లవం వచ్చిన వెంటనే తెలుగుజాతికి దీని ఫలాలు అందించాలని భావించిన నాయకుడు చంద్రబాబు నాయుడు అని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కంప్యూటర్ కూడు పెడుతుందా? అని అప్పట్లో తప్పుడు ప్రచారం చేయడంతో ఓ ఎన్నికల్లో కూడా ఆయన ఓడిపోయారని గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు నాడు చేసిన కృషి వల్ల ప్రతి రైతు, ప్రతి కూలీ, ప్రతి కార్మికుడి ఇంట్లో నేడు ఓ ఐటీ ఉద్యోగి వచ్చారని వివరించారు. వారు అమెరికాలో ఉద్యోగాలు చేస్తూ ఇక్కడ వారి తల్లితండ్రులకు నగదు పంపిస్తూ ఇటు రాష్ట్ర సంపదని సైతం పెంపొందిస్తున్నారన్నారు.

ఇప్పుడా హైదరాబాదు సంపద ఉపాధి కేంద్రంగా మారిందని.. అలాగే భవిష్యత్తులో అమరావతి కూడా మనకు నిర్మితం కావాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. చంద్రబాబు నాయుడు లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలో విద్యుతే లేకుండా అంధకారమే ఉండేదన్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొత్తం 19 మంది ముఖ్యమంత్రులు పరిపాలించారని.. ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రమే 15వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని సాధించారని వివరించారు.


చంద్రబాబు పాలన చేపట్టే నాటికి కేవలం 5000 మెగావాట్లు మాత్రమే ఉండేదని..తరువాత వచ్చిన వారంతా 2000 మెగావాట్లు మాత్రమే అదనంగా చేయగలిగారన్నారు. వ్యవసాయం, పరిశ్రమలు ఏది అభివృద్ధి చెందాలన్నా విద్యుత్ తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. నదులు అనుసంధానం గురించి మాట్లాడిన ముఖ్యమంత్రిలు ఇద్దరే ఇద్దరని ఒకరు ఎన్టీ రామారావు కాగా, మరొకర చంద్రబాబు మాత్రమేనని ఆయన తెలిపారు.


1995లో ముఖ్యమంత్రిగా ఫైళ్ళ క్లియరెన్స్, క్లీన్ అండ్ గ్రీన్ వంటి అనేక కాన్సెప్ట్‌లను సీఎం చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన ప్రసంగాలన్నీ ఒక పుస్తకంలో.. ప్రతిపక్ష నేతగా ఉండి బాబ్లీలో పోరాటం చేసి మహారాష్ట్రలో జైలు కూడా వెళ్లారని గుర్తు చేశారు. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ఆ సమయంలో దెబ్బలు కూడా తిన్నారన్నారు.

ఇలాంటివన్నీ పుస్తకంలో రాయకపోతే భావితరాలకు ఎలా తెలుస్తుందంటూ సందేహం వ్యక్తం చేశారు. తన పిల్లలు ఇద్దరు జయప్రద ఫౌండేషన్ పేరుతో ఓ ట్రస్ట్ ఏర్పాటు చేశారనన్నారు. ఆ ట్రస్ట్ ద్వారా ఈ పుస్తకాలను ప్రచురణ చేయిస్తున్నామన్నారు. తాను సపోర్ట్ అందిస్తే విక్రమ్ పూల పుస్తకాలను ఓ రూపు తీసుకు వచ్చారంటూ ఆయనను ఈ సందర్భంగా టీడీ జనార్దన్ ప్రశంసించారు.

ఇది కూడా చదవండి..

CM Chandrababu Birthday: సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకల్లో అపశృతి

For Andhrapradesh News And Telugu News

Updated Date - Apr 20 , 2025 | 04:53 PM