ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Kishan Reddy: బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అవినీతి పార్టీలు

ABN, Publish Date - Jun 03 , 2025 | 03:53 AM

బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ రెండూ దోపిడీ, అవినీతి పార్టీలే అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు.

  • ఒట్టేసి చెబుతున్నా రాష్ట్ర అభివృద్ధి బాధ్యత మాదే:కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ రెండూ దోపిడీ, అవినీతి పార్టీలే అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. కేసీఆర్‌ చెప్పిన బంగారు తెలంగాణ సాధించలేదని, ఆయన కుటుంబం మాత్రం బంగారమైందని ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రభుత్వాన్ని ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలా నడిపిందని మండిపడ్డారు. గతంలో సోనియా గాంధీని ‘తెలంగాణ పాలిట దయ్యం’ అన్న రేవంత్‌ రెడ్డి.. ముఖ్యమంత్రి పదవి రాగానే దేవతగా పొగడటం ఆయన ద్వంద్వ వైఖరికి నిదర్శనమని అన్నారు. మిగులు బడ్జెట్‌తో ప్రారంభమైన తెలంగాణ రూ.10 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని, ఇది టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పాలనల వల్లే అని స్పష్టం చేశారు.


తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్‌రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అన్ని పార్టీలకన్నా ముందుగా బీజేపీ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నదని, జేఏసీలో చేరిన ఏకైక జాతీయ పార్టీ బీజేపీయేనని తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పునః నిర్మించాలంటే బీజేపీనే ప్రత్యామ్నాయమని అన్నారు. ‘‘ఒట్టేసి చెబుతున్నా.. తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం. తెలంగాణను నీతి, నిజాయితీ, అంకితభావంతో అభివృద్ధి చేస్తాం. ఇది బీజేపీ మాట. ప్రధాని మోదీ మాట’’ అని కిషన్‌రెడ్డి ప్రకటించారు. మూడు తరాల ఉద్యమం, వేల మంది బలిదానాల ఫలితంగా తెలంగాణ ఆవిర్భవించిందని ఎంపీ ఈటల రాజేందర్‌ అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

బేకరీలో దారుణం.. అందురూ చూస్తుండగానే..

చుండ్రు సమస్యకు సింపుల్ చిట్కాలు..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 03 , 2025 | 03:53 AM