ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Khammam: మహిళా ఎస్సై పై చేయి చేసుకున్న కాంగ్రెస్ నేత.. ఎందుకంటే..

ABN, Publish Date - Jun 07 , 2025 | 04:01 PM

ఖమ్మం: ఖమ్మం జిల్లాలోని కల్లూరులో అర్ధరాత్రి వేళ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మహిళా ఎస్‌ఐ పై కాంగ్రెస్ నేత దాడి చేయడం తీవ్ర కలకలం రేపుతోంది.

Man Attacked Lady SI In Khammam

ఖమ్మం: ఖమ్మం జిల్లా కల్లూరులో శుక్రవారం రాత్రి షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కల్లూరు చౌదరి హోటల్ వద్ద అర్ధరాత్రి సమయంలో విధుల్లో ఉన్న ఎస్‌ఐ హరితపై కాంగ్రెస్ నేత రాము దాడికి పాల్పడ్డాడు. హోటల్ సిబ్బందితో గొడవ పడుతున్న రాము, అతడి అనుచరులను వారించేందుకు లేడీ ఎస్సై వెళ్లారు. ఈ వాగ్వాదం సందర్భంగా ఎస్సై మాట వినకపోగా ఆమెపైన కూడా దాడికి పాల్పడ్డారు.


విధుల్లో ఉన్న మహిళా పోలీసుపై ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నేత దాడికి తెగబడిన ఘటన సంచలనం రేపుతోంది. కల్లూరు పట్టణంలో శుక్రవారం రాత్రి జరిగిన ఈ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కల్లూరు ఎన్ఎస్‌పీ సెంటర్ వద్ద అర్ధరాత్రి సమయంలో కాంగ్రెస్ నేత రాము హోటల్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఘర్షణ ముదరడంతో స్నేహితులకు కాల్ చేసి పిలిపించాడు. అందరూ కలిసి హోటల్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. దీంతో హోటల్ యజమాని పోలీసులకు ఫోన్ చేశారు.


సమాచారం అందిన వెంటనే లేడీ ఎస్సై హరిత ఘర్షణ జరుగుతున్న చోటుకి వెళ్లారు. గొడవ పడుతున్న కాంగ్రెస్ నేత, అతడి అనుచరులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఆమెతో పాటు చుట్టుపక్కల వారు కూడా నచ్చజెప్పారు. గొడవ ఆపేసి శాంతించాలని చెప్పారు. అయినా, రాము, అతడి అనుచరులు ఎవరి మాటలు వినిపించుకోలేదు. ఏకంగా ఎస్సై పైనే తిరిగి దాడి చేసి నెట్టివేశారు. మహిళ అని కూడా చూడకుండా ఎస్సై హరిత భుజంపై చేయి వేసి బలంగా తోసేశాడు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.


విధుల్లో ఉన్న మహిళా ఎస్సై పై అనుచితంగా ప్రవర్తించిన తల్లాడ మండలానికి చెందిన రాము, అతడి స్నేహితులు ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. కనీసం మర్యాద లేకుండా మహిళా ఎస్సై పై నే ఇలా దౌర్జన్యంగా చేయి చేసుకోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఈ ఘర్షణకు సంబంధించిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది.


ఇవి కూడా చదవండి..

ఏపీకి గూగుల్.. స్థలం పరిశీలన పూర్తి

ఏఐజీ హాస్పటల్‌లో అగ్నిప్రమాదం.. చెలరేగిన మంటలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 07 , 2025 | 05:42 PM