BRS: బీజేపీపై రెండే నిమిషాలా?
ABN, Publish Date - May 23 , 2025 | 03:47 AM
కిందటి నెలలో వరంగల్‌లో నిర్వహించిన పార్టీ రజతోత్సవ సభలో బీజేపీని లక్ష్యంగా చేసుకుని ఇంకా గట్టిగా మాట్లాడాల్సి ఉందంటూ.. బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కవిత స్వదస్తూరీతో లేఖ రాశారు.
రజతోత్సవ సభలో ఆ పార్టీని ఇంకా టార్గెట్ చేసి ఉండాల్సింది డాడీ
‘‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేయకుండా బీజేపీకి సాయం చేశామనే సందేశాన్ని కాంగ్రెస్ ప్రజల్లోకి తీసుకెళ్లింది. ఇలాంటి రాజకీయ పరిస్థితిని ఎదుర్కోవడానికి మీరు నిర్దిష్ట కార్యాచరణ ఇస్తారని అందరూ ఆశించారు. ఇప్పటికైనా 1-2 రోజులు పార్టీ ప్లీనరీ నిర్వహించి వీలైనంత ఎక్కువ మంది అభిప్రాయాలు వినండి. ఈ విషయాన్ని కొంచెం సీరియ్‌సగా తీసుకోండి.’’
- లేఖలో కవిత
అలా చేయకపోవడం వల్ల భవిష్యత్తులో వారితో
పొత్తు పెట్టుకుంటారనేఊహాగానాలు
బీజేపీ మనకు ప్రత్యామ్నాయం అవుతుందేమో
అని మన పార్టీ కార్యకర్తలే అనుకుంటున్నారు
ధూం ధాం విఫలమైంది.. 2001 నుంచి
మీతో ఉన్న వారితో సభలో మాట్లాడించాల్సింది
కొందర్నే మీరు కలుస్తున్నారు.. అందర్నీ కలవండి
ఇప్పటికైనా 1-2 రోజులు ప్లీనరీ నిర్వహించండి
బీఆర్‌ఎస్ చీఫ్ కేసీఆర్‌కు కవిత 7 పేజీల లేఖాస్త్రం
తొలి మూడు పేజీల్లో సానుకూల అంశాల ప్రస్తావన
మిగతా నాలుగు పేజీల్లో ప్రతికూల అంశాల వెల్లడి
హైదరాబాద్, మే 22, (ఆంధ్రజ్యోతి): కిందటి నెలలో వరంగల్‌లో నిర్వహించిన పార్టీ రజతోత్సవ సభలో బీజేపీని లక్ష్యంగా చేసుకుని ఇంకా గట్టిగా మాట్లాడాల్సి ఉందంటూ.. బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కవిత స్వదస్తూరీతో లేఖ రాశారు. కేసీఆర్ అలా చేయకపోవడం వల్ల.. బీఆర్‌ఎస్ భవిష్యత్తులో బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందనే ఊహాగానాలు మొదలయ్యాయని అందులో పేర్కొన్నారు. బీజేపీపై కేసీఆర్ ఇంకా బలంగా మాట్లాడాలని తనకు కూడా ఉందని తెలిపారు. మే 2వ తేదీన ఆమె రాసిన ఏడు పేజీల లేఖ.. గురువారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ‘‘డాడీ.. సభ విజయవంతం అయినందుకు ముందుగా మీకు శుభాకాంక్షలు. ఈ సందర్భంగా నా దృష్టికి వచ్చిన కొన్ని సానుకూల, ప్రతికూల స్పందనలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను.’’ అంటూ తొలి మూడు పేజీల్లో సానుకూల అంశాలను ప్రస్తావించిన ఆమె.. తర్వాతి నాలుగు పేజీల్లో ప్రతికూల అంశాల గురించి సవివరంగా వెల్లడించారు. కాంగ్రె్‌సపై కిందిస్థాయిలో నమ్మకం పోయిందని ఆ లేఖలో పేర్కొన్న ఆమె.. ఆ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీ అవుతుందేమో అనే భావనను పార్టీ కార్యకర్తలే వ్యక్తం చేస్తున్నారని ఆవేదన వెలిబుచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేయకుండా బీజేపీకి సాయం చేశామనే సందేశాన్ని కాంగ్రెస్ పార్టీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లిందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘ఇలాంటి రాజకీయ పరిస్థితులను ఎదుర్కోవడానికి మీరు ఒక నిర్దిష్ట కార్యాచరణ ఇస్తారని అందరూ ఆశించారు.
కనీసం ఇప్పటికైనా ఒకటి, రెండు రోజులు పార్టీ ప్లీనరీ నిర్వహించండి. వీలైనంత ఎక్కువమంది అభిప్రాయాలు వినండి. ఈ విషయాన్ని కొంచెం సీరియ్‌సగా తీసుకోండి.’’ అని సూచించారు. రజతోత్సవ సభలో కేసీఆర్ ఉర్దూలో మాట్లాడకపోవడం, వక్ఫ్ బిల్లు గురించి ప్రస్తావించకపోవడం, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశాన్ని విస్మరించడం, ఎస్సీ వర్గీకరణ విషయంపై మాట్లాడకపోవడం ప్రతికూల అంశాలుగా కవిత పేర్కొన్నారు. అంతేకాదు.. అంతపెద్ద సభకు మళ్లీ పాత ఇన్‌చార్జులనే ఇవ్వడంతో వాళ్లు పాత పద్ధతిలో తెలంగాణ ఉద్యమకారులకు సదుపాయాలను కల్పించలేదనే ఫీడ్‌బ్యాక్ (సమాచారం) తనకు వచ్చిందని తెలిపారు. మళ్లీ పాత ఇన్‌చార్జులకే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బీ-ఫారమ్ ఇస్తుందని ఇన్‌చార్జులు చెప్పుకుంటున్నట్టు తనకు తెలిసిందని పేర్కొన్నారు. ‘‘స్థానిక సంస్థల్లో సర్పంచ్‌లుగా పోటీచేయాలనుకునే వాళ్లు రిలాక్స్‌డ్‌గా ఉన్నారు. కానీ ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీగా పోటీచేయాలనుకునేవాళ్లు మాత్రం బీ ఫారాలను ఇన్‌చార్జుల నుంచి కాకుండా నేరుగా రాష్ట్ర పార్టీ నుంచే ఇవ్వాలని కోరుతున్నారు’’ అని తెలిపారు. అలాగే.. సభలో కేసీఆర్ వేదికపైకి వచ్చేలోపు.. 2001 నుంచి ఆయనతోటే ఉన్న నాయకులకు మాట్లాడే అవకాశం ఇస్తే బాగుండేదని చాలా మంది అన్నట్టు లేఖలో రాశారు. కార్యకర్తలను ఆకట్టుకోవడంలో ‘‘ధూం..ధాం’’ విఫలమైందన్నారు. ‘‘జడ్పీటీసీ, జడ్పీ ఛైర్మన్, ఎమ్మెల్యే స్థాయి వాళ్లు కూడా మిమ్మల్ని కలవడానికి అవకాశం దొరకడంలేదని బాధపడుతున్నారు. కొంతమందే కలవగలుగుతున్నారు. ఎంపికచేసిన వాళ్లే కలిసే పరిస్థితి ఉందని భావిస్తున్నారు. దయచేసి అందరినీ కలవండి’’ అని కేసీఆర్‌కు కవిత సూచించారు.
సానుకూల అంశాలూ..
లేఖలో తొలి రెండు పేజీల్లో ఆమె పలు సానుకూల అంశాలను ప్రస్తావించారు. ‘‘క్యాడర్‌లో ఉత్సాహం చాలా బాగుంది. వారంతా సభలో మీరు మాట్లాడుతున్నంతసేపూ .. చివరిదాకా ఉండి శ్రద్ధగా విన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’పై మీరు మాట్లాడడం చాలా మందికి నచ్చింది. పలు అంశాలు, ఇచ్చిన హామీలను అమలుచేయడంలో కాంగ్రెస్ విఫలమైందంటూ ‘కాంగ్రెస్ ఫెయిల్.. ఫెయిల్’’ అ ని చెప్పిన తీరు బాగుందని అనుకుంటున్నారు. సమావేశంలో రేవంత్‌రెడ్డి పేరుతో తిట్టకపోవడం చాలా మందికి నచ్చింది. రేవంత్ రోజూ విమర్శి స్తున్నా.. మీరు హుందాగా ఉన్నారని నాకు సమాచారం వచ్చింది’’ అని పేర్కొన్నారు.
ఇంకొన్ని పంచ్‌లు ఆశించారు..
‘‘తెలంగాణ అంటే బీఆర్‌ఎస్ అని.. తెలంగాణ అంటే కేసీఆర్ అని మీరు బలంగా చెప్తారని చాలామంది అనుకున్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం, తెలంగాణ గీతం గురించి మీరు మాట్లాడతారని ఎదురుచూశారు. మొత్తంగా సభలో మీ నుంచి ఇంకొంచెం పంచ్‌లను జనం ఆశించారు. అయితే మొత్తంగా చూస్తే క్యాడర్, లీడర్లు సభ విషయంలో సంతృప్తితో ఉన్నారు’’ అని కవిత తన లేఖలో వెల్లడించారు. పోలీసులకు ఇచ్చిన హెచ్చరికలు బాగున్నాయని.. పహల్గాం అమరులకు నివాళిగా మౌనం పాటించడం బాగుందని పేర్కొన్నారు. ‘‘చాలామంది మీతో ఫొటో దిగాలని, చెయ్యి కలపాలని అంటుంటే ఎంతో సంతోషం అనిపించింది.’’అని కవిత తన లేఖలో రాశారు.
ఈ వార్తలు కూడా చదవండి
jagtyaala : పాఠ్య పుస్తకాలు వస్తున్నాయి..
Crime News: తెలంగాణ భవన్ నుంచి సైబర్ నేరస్తుడు పరారీ..
TG News: ఢీకొన్న రెండు కార్లు.. ఆ తర్వాత ఏమైందంటే..
Indigo Flight Delay: ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య
Read Latest Telangana News And Telugu News
Updated Date - May 23 , 2025 | 05:56 AM