TG NEWS: ఆ యూనివర్సిటీలో అగ్నిప్రమాదం.. కీలక ఫైళ్లు దగ్ధం
ABN, Publish Date - Apr 25 , 2025 | 09:46 AM
Satavahana University: శాతవాహన యూనివర్సిటీలో శుక్రవారం నాడు అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంతో స్టోర్ రూమ్‌లోని పాత పరీక్ష పత్రాలు.. విలువైన పుస్తకాలు కాలిపోయాయి. మంటలను ఫైర్ సిబ్బంది అర్పుతున్నారు.
కరీంనగర్: శాతవాహన యూనివర్సిటీలో ఇవాళ(శుక్రవారం) అగ్నిప్రమాదం జరిగింది. స్టోర్‌రూమ్‌లోని పాత పరీక్ష పత్రాలు, విలువైన పుస్తకాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. భారీగా ఫైళ్లు దగ్ధం కావడం వల్ల పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పివేశారు. ప్రమాదం జరిగిన తీరుపై యూనివర్సిటీ అధికారులు ఆరా తీశారు. ఈ అగ్ని ప్రమాదంపై శాతవాహన యూనివర్సిటీ వీసీ ఉమేష్ కుమార్ మీడియాతో మాట్లాడారు.
శాతవాహన వర్సిటీలో అగ్నిప్రమాదంలో నష్టమేమీ జరగలేదని యూనివర్సిటీ వీసీ ఉమేష్ కుమార్ తెలిపారు. అగ్నికి ఆహుతైన పత్రాలు, పేపర్లు డిజిటలైజేషన్ అయ్యాయని అన్నారు. ప్రస్తుతం మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయని వీసీ ఉమేష్ కుమార్ వెల్లడించారు. ప్రతి ఏడాది చిన్న ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయని అన్నారు. అగ్నిప్రమాదంపై పూర్తి స్థాయిలో విచారణ చేసి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. ఒక చోట మంటలు అర్పగానే.. మరో చోట వస్తున్నాయని తెలిపారు. ప్రస్తుతం మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయని యూనివర్సిటీ వీసీ ఉమేష్ కుమార్ వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి
MIM: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి విజయం
Counting: ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం..
విజయవాడలో 'మైండ్ సెట్ షిఫ్ట్' పుస్తకావిష్కరణలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
Read Latest Telangana News And Telugu News
Updated Date - Apr 25 , 2025 | 10:35 AM